Tallest Teenage: ప్రపంచంలో ఎవరైనా సరే ఈ అబ్భాయిని తలెత్తుకుని చూడాల్సిందే.. తన ఎత్తుతో ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నాడు.. శనివారం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యువకుడి వీడియోను షేర్ చేసింది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ (Guinness World Records) సంస్థ. మరి గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకున్నాడంటే.. అబ్బాయి ఎత్తు ఎంత అని ఆత్రుత కలుగుతోందా.. 16 ఏళ్ల ఈ యువకుడు ఎత్తు 7 అడుగుల 5.33 అంగుళాలు 226.9 సెం.మీ. పేరు ఒలివియర్ రియోక్స్ (Olivier Rioux).. కెనడా స్వస్థలం. ఒలివియర్ రియోక్స్ బాస్కెట్‌బాల్ ఆడతాడు.. ఈ యువకుడి వీడియో నెటిజన్లను ఆకట్టుకుంది. సుమారు 8 లక్షల వ్యూస్ సొంతం చేసుకుంది.
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ షేర్ చేసిన ఈ వీడియోలో యువకుడు తన ఇంటిలోకి ప్రవేశించడానికి క్రిందికి వంగి వెళ్తున్నాడు. బాస్కెట్‌బాల్ ఆడుతున్నాడు. మిగిలిన ఆటగాళ్ల కంటే ఈజీగా బాస్కెట్‌బాల్ గ్రౌండ్ లో దూసుకుపోతున్నాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వెబ్‌సైట్ ప్రకారం రియోక్స్ 15 ఏళ్ల వయసులో.. గతేడాది సెప్టెంబర్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యువకుడిగా గుర్తింపు పొందాడు.
“7.5 పౌండ్ల బరువుతో జన్మించిన ఆలివర్ తన మొదటి నెలలో 16 పౌండ్లకు పెరిగాడు .. అలా మొదలైన పెరుగుదల జర్నీ నేటికీ కొనసాగుతూనే ఉంది. అత్యంత వేగంగా పెరుగుతూ గ్రేడ్ 5లో 5 అడుగుల 2 అంగుళాల పొడవుకు చేరుకున్నాడు.
ఇన్‌స్టాగ్రామ్‌లో “ఎత్తైన యువకుడు 226.9 సెం.మీ (7 అడుగులు మరియు 5.33 అంగుళాలు)” అని ట్విట్ చేసింది
క్రింద వీడియో చూడండి
ఈ బాలుడు హాట్ కు నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. దేవుడు అశీసులు ఈ బాలుడికి లభిస్తాయి. ఈ బాలుడి చేతిలో బాస్కెట్‌బాల్ .. నాకు చాలా ఆనందంగా ఉంది.. నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది” అని మరొకరు చెప్పారు. ఒలివియర్ రియోక్స్ తన ఇన్ స్టాగ్రామ్ లో 28,000 మంది ఫాలోవర్లను కలిగి ఉన్నాడు. తన ఎత్తు కారణంగా ఇతరులతో ఎలా సర్దుబాటు చేసుకుంటానో తెలియజేస్తూ.. దానికి సంబంధించిన స్నిప్పెట్‌లను షేర్ చేస్తాడు. ఫోటోగ్రాఫర్‌లు అతని ఫోటోలు తీయడానికి టేబుల్‌లపై ఎలా నిలబడతాడో చూపిస్తూ తన వ్యక్తిగత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో అందరినీ ఆకట్టుకుంది.
Also Read: WhatsApp: యూజర్లకు షాకిచ్చిన వాట్సాప్.. 14.26 లక్షల భారతీయ ఖాతాలపై నిషేధం.. ఎందుకంటే..!