Watch Video: అమ్మ తల్లో.. 1 నిమిషంలో అరకేజీ చీజ్ మింగేసింది.. వీడియో చూసేయండి..

|

Sep 09, 2023 | 11:40 AM

ప్రస్తుత కాలంలో చాలా మంది ప్రజలు ఫాస్ట్ ఫుడ్స్‌లో చీజ్‌ని చేర్చి ఇష్టంగా తింటుంటారు. పిజ్జా, శాండ్‌విచ్, బర్గర్ ఏదైనా సరే.. చాలా ఫాస్ట్ ఫుడ్స్‌లో చీజ్ యాడ్ చేయాల్సిందే. అయితే, ఎక్కువ చీజ్ తినడం ఆరోగ్యానికి చాలా హానికరం అని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అందుకే పరిమిత పరిమాణంలో మాత్రమే తినాలని సూచిస్తుంటారు. కొందరు ప్రజలు చీజ్ తినే విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటిస్తుంటారు. మరికొందరు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసినప్పటికీ, ఎవరూ ఎక్కువగా అయితే తినలేరు.

Watch Video: అమ్మ తల్లో.. 1 నిమిషంలో అరకేజీ చీజ్ మింగేసింది.. వీడియో చూసేయండి..
Cheez
Follow us on

ప్రస్తుత కాలంలో చాలా మంది ప్రజలు ఫాస్ట్ ఫుడ్స్‌లో చీజ్‌ని చేర్చి ఇష్టంగా తింటుంటారు. పిజ్జా, శాండ్‌విచ్, బర్గర్ ఏదైనా సరే.. చాలా ఫాస్ట్ ఫుడ్స్‌లో చీజ్ యాడ్ చేయాల్సిందే. అయితే, ఎక్కువ చీజ్ తినడం ఆరోగ్యానికి చాలా హానికరం అని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అందుకే పరిమిత పరిమాణంలో మాత్రమే తినాలని సూచిస్తుంటారు. కొందరు ప్రజలు చీజ్ తినే విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటిస్తుంటారు. మరికొందరు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసినప్పటికీ, ఎవరూ ఎక్కువగా అయితే తినలేరు. ఒక వ్యక్తి ఒక పరిమితి వరకు మాత్రమే దేనినైనా తినగలడు. ఎందుకంటే దీన్ని అతిగా తినడం వల్ల హాని కలుగుతుంది. అయితే ఒక్క నిమిషంలో 500 గ్రాముల మోజారెల్లా జున్ను తింటూ ఓ అమ్మాయి ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇప్పుడిదే సంచలనంగా మారింది.

ఈ ప్రపంచ రికార్డును యూరోపియన్‌ మహిళ లీహ్ షట్‌కేవర్‌ నమోదు చేసింది. ఆమె కేవలం ఒక నిమిషంలో 500 గ్రాముల మోజారెల్లా జున్ను తిన్నది. వాస్తవానికి ఇది చాలా కష్టమైన పని. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఇన్‌స్టాగ్రామ్ పేజీ నుండి పోస్ట్ చేయబడిన ఈ ప్రపంచ రికార్డు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన తర్వాత, వినియోగదారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని కూడా ఎవరైనా రికార్డు చేస్తారంటే నమ్మలేకపోతున్నారు.

ప్రపంచ రికార్డు సృష్టించింది..

లీహ్ షట్‌కేవర్ టేబుల్‌పై కూర్చున్నట్లు వైరల్ వీడియోలో చూడవచ్చు. మొజారెల్లా చీజ్ రెండు పెద్ద ముక్కలు టేబుల్ మీద ప్లేట్‌లో ఉంచారు. టైమ్ స్టార్ట్ అని చెప్పగానే.. లీహ్ వెంటనే మోజారెల్లా చీజ్ తినడం ప్రారంభించింది. ఆమె మొదట ఒక ముక్కను తీసుకొని మింగడం ప్రారంభించింది. దానిని మింగిన వెంటనే లీహ్ మరో ముక్కను తీసుకుని, ఇచ్చిన సమయానికి దానిని తిని ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. దీనిపై తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమైంది షాక్ అయితే, మరికొంత మంది దానిని చూసి వాంతులు చేసుకున్నారట. ఇదే విషయాన్ని చెబుతూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టారు. ఈ వీడియో చూసిన తరువాత నాకు రెండు సార్లు వాంతులు అయ్యాయి అంటూ కామెంట్ పెట్టారు మరో నెటిజన్. ఈ ఛాలెంజ్ తరువాత ఆమె తప్పకుండా ఆస్పత్రికి వెళ్లే ఉంటుందని మరో నెటిజన్ల తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..