ప్రపంచంలోనే అతి చిన్న పార్క్.. సైజ్‌ తెలిస్తే అవాక్కే..! గిన్నిస్ వరల్డ్ రికార్డ్ షేర్‌ చేసిన వీడియో వైరల్.. ఎక్కడంటే..

తరచుగా పెద్ద పెదద్ పార్కులు, స్టేడియంల గురించిన వార్తలు, చర్చలు జరుగుతుంటాయి. కానీ ఈసారి జపాన్‌లో నిర్మించిన ఒక చిన్న పార్క్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. అవును, ప్రపంచంలోనే అతి చిన్న పార్క్ పేరు గిన్నిస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదైంది. దాంతో ఈ బుల్లి పార్క్ అందాలను  చూసేందుకు, అక్కడి విశేషాలను తెలుసుకోవడానికి ఇంటర్నెట్ వినియోగదారులు కూడా  చాలా ఆసక్తిగా ఉన్నారు.

ప్రపంచంలోనే అతి చిన్న పార్క్.. సైజ్‌ తెలిస్తే అవాక్కే..! గిన్నిస్ వరల్డ్ రికార్డ్ షేర్‌ చేసిన వీడియో వైరల్.. ఎక్కడంటే..
World Smallest Park

Updated on: Mar 02, 2025 | 12:45 PM

పార్క్ పేరు వినగానే చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరి మనసులో ఒకే చిత్రం మెదులుతుంది. కొన్ని ఊయలలు, వాకింగ్‌ట్రాక్‌, హాయిగా కూర్చుని సేద తీరేందుకు బెంచీలు ఉండటం గుర్తుకు వస్తుంది. కానీ, ఇక్కడ ఉన్న ఒక పార్క్‌ ప్రపంచంలోనే అతి చిన్న పార్క్..ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోనూ తన పేరును నమోదు చేసుకునే ఘనతను సాధించింది. అవును మీరు చదివింది నిజమే..మీరు కూడా ఈ ప్రపంచంలోనే అతి చిన్న పార్క్ ఎలా ఉంటుందో, దానిలో ఏయే విషయాలు ఉంటాయా అని ఆలోచిస్తూ ఉంటారు. అయితే, మరెందుకు ఆలస్యం..ఈ వైరల్ స్టోరీలో, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన ఈ పార్క్ గురించి తెలుసుకుందాం..

ప్రపంచంలోనే అతి చిన్న పార్క్…
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తన యూట్యూబ్ ఛానెల్‌లో ప్రపంచంలోనే అతి చిన్న పార్క్ వీడియోను అప్‌లోడ్ చేసింది. ప్రపంచంలోనే అతి చిన్న పార్క్ కేవలం 0.24 చదరపు మీటర్లు మాత్రమే ఉందని, ఇది జపాన్‌లోని షిజువోకాలోని నాగైజుమి పట్టణంలో ఉందని పేర్కొంది. గిన్నిస్ వరల్డ్ ఆఫ్ రికార్డ్స్ అధికారిక సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ వీడియోను చూసి యూజర్లు ఆశ్చర్యంతో పాటు ఎంతగానో ఆనందిస్తున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

ఇప్పటివరకు ఈ వీడియోకు 11 వేలకు పైగా వీక్షణలు, 400 కి పైగా లైక్‌లు వచ్చాయి. ప్రపంచంలోనే అతి చిన్న పార్కు వీడియోను ఎక్కువ మంది షేర్‌ చేస్తున్నారు. మరింత వైరల్‌గా మార్చేస్తున్నారు. . వైరల్ వీడియోలో కనిపిస్తున్న ప్రపంచంలోనే అతి చిన్న పార్క్ 1988లో నిర్మించబడింది.

ఈ పార్క్ A3 సీటులో 2 పేజీల పెద్దది. దాని లోపల ఒక ప్రవేశ ద్వారం, ఒక బెంచ్, కొంత గడ్డి ఉన్నాయి. అయితే, వైరల్ వీడియోలో ఈ గడ్డిలో చిన్న చెట్లను కూడా నాటినట్లు ఆ వ్యక్తి పేర్కొన్నాడు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…