
పెళ్లంటే విందులు, వినోదాలు తప్పకుండా ఉండాల్సిందే. ముఖ్యంగా పెళ్లి వేడుకల్లో భాగంగా నిర్వహించే బరాత్‌లు, సంగీత్‌లలో వధూవరుల కుటుంబీకులు, స్నేహితులు, సన్నిహితులు చేసే సందడి మాములుగా ఉండదు. సినిమా పాటలు, డ్యా్న్స్ లతో పెళ్లిమండపాన్ని హోరెత్తిస్తుంటారు. ఈ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా అప్పుడప్పుడు నెట్టింట్లో ట్రెండ్ అవుతుంటాయి. అలా పంజాబ్‌లో నిర్వహించిన ఓ పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. ఈ పెళ్లి వేడుకకు హాజరైన అతిథులందరూ చీపుర్లు పట్టుకుని బాంగ్రా డ్యాన్స్ చేయడమే ఇందుకు కారణం.
ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్‌లో కూడా పాగా వేసిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 92 సీట్లు గెల్చుకుని క్లీన్ స్వీప్ చేసింది. దీంతో పంజాబ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసిన చీపుర్ల ట్రెండ్ కనిపిస్తోంది. తాజాగా పంజాబ్‌లోని భాటిండా అనే ప్రాంతంలో జరిగిన ఓ పెళ్లిలోనూ చీపుర్ల ట్రెండ్ కొనసాగింది. ఈ పెళ్లి వేడుకల్లో భాగంగా ఏర్పాటుచేసిన సంగీత్‌లో అతిథులందరూ చీపుర్లు పట్టుకొని డ్యాన్స్ చేశారు. పెళ్లి మండపం మీదనే చేతుల్లో చీపుర్లు పట్టుకుని మరీ భాంగ్రా డ్యాన్స్ వేస్తూ అదరగొట్టేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘పంజాబీలు ఆమ్‌ఆద్మీ పార్టీకి అవకాశం ఇచ్చారు. చీపురు పట్టుకోవడం, ఇలా డ్యాన్స్ చేయడం పంజాబ్‌లో ఇప్పుడేమీ చిన్నతనం కాదు’ అని ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. మరి నెటిజన్లను ఆకట్టుకుంటోన్న ఈ వైరల్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
This is why AAP won in Punjab; sporting a broom, while dancing in a wedding is not a taboo anymore. Punjabis, gave AAP a chance, let’s hope they deliver !! pic.twitter.com/Y2iKnPgeqF
— Ramandeep Singh Mann (@ramanmann1974) March 13, 2022
Bank Loan: సెకండ్ హ్యాండ్ కార్లపై రుణాలు.. ఏ బ్యాంకు ఎంత వడ్డీ ఉంటుందంటే..!