
Vrial Video: పాములు అనేవి ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జీవులలో ఒకటి. వాటిని చూడగానే ప్రజలు వణికిపోతారు. మనుషుల గురించి చెప్పనవసరం లేదు. అయితే, పాములకు అస్సలు భయపడని కొన్ని పక్షులు కూడా ఉన్నాయని మీకు తెలుసా? ఈ పక్షి పేరు గ్రౌండ్ హార్న్‌బిల్. ఇది ఆఫ్రికాకు చెందినది. గ్రౌండ్ హార్న్‌బిల్ పాములను చంపేదిగా పరిగణిస్తారు. పాములు ఎంత విషపూరితమమైనవిగా ఉన్నా చంపే సామర్థ్యం ఆ పక్షిలో ఉంటుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Public Holiday: ఇక్కడ అక్టోబర్ 7న పాఠశాలలు, కార్యాలయాలకు సెలవు.. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
ఈ వీడియోలోని పక్షులు సదరన్ గ్రౌండ్ హార్న్‌బిల్స్ అవి పఫ్ అడెర్స్ అని పిలిచే పాములను వేటాడుతాయి. పఫ్ అడెర్స్ పాము అనేది అత్యంత విషపూరితమైన వైపర్ జాతికి చెందినది. ఈ పాముల కాటుతో ప్రతి సంవత్సరం ఆఫ్రికాలో లెక్కలేనన్ని మందిని చనిపోతున్నారని నివేదికల ద్వారా తెలుస్తోంది. కానీ గ్రౌండ్ హార్న్‌బిల్స్ ఈ పాముకి అస్సలు భయపడవట. వీడియోలో ఈ పక్షులు పఫ్ అడెర్‌ను వేటాడి, దానిని చంపి, సంతోషంగా ఎలా తింటున్నాయో మీరు చూడవచ్చు. గ్రౌండ్ హార్న్‌బిల్స్ ముక్కులు చాలా పెద్దవిగా, పదునైనవిగా, బలంగా ఉంటాయి. పాములు దానిని తట్టుకోలేవు. అందుకే ఈ పక్షులు సులభంగా పాములను వేటాడి చంపి తింటాయి.
ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X (ట్విట్టర్)లో @AmazingSights అనే IDతో షేర్ అయ్యింది. “ఆఫ్రికాలో ఇతర పాము కంటే పఫ్ యాడర్లు ఎక్కువ మానవ మరణాలకు కారణమవుతాయి. దక్షిణ గ్రౌండ్ హార్న్‌బిల్‌లకు అలాంటి సమస్యలు లేవు” అని క్యాప్షన్ ఉంది. ఈ ఒక నిమిషం 19 సెకన్ల వీడియోను చాలా మంది వీక్షించారు. వందలాది మంది దీనిని లైక్ చేసి వివిధ రకాలుగా కామెంట్లు చేశారు.
Puff adders are responsible for more human fatalities in Africa than any other snake.
No such problems for the Southern Ground Hornbill.pic.twitter.com/7oYpO5RGRX
— Damn Nature You Scary (@AmazingSights) October 4, 2025
ఇది కూడా చదవండి: Mukesh Ambani: ఆంటిలియా రహస్యాలు.. ముఖేష్ అంబానీ ఇంట్లో పని చేసే చెఫ్‌కి జీతం ఎంతో తెలిస్తే షాకవుతారు!
ఇది కూడా చదవండి: Refrigerator: ఫ్రిజ్‌లో వేడి పదార్థాలు పెడుతున్నారా? పెద్ద నష్టమే.. ఏంటో తెలుసుకోండి!
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి