Groom for Sale: అరుదైన సంప్రదాయం.. అంగట్లో అమ్మాకానికి పెళ్లి కుమారులు.. వివరాలు తెలిస్తే మతిపోవాల్సిందే..

|

Aug 10, 2022 | 1:04 PM

Groom for Sale: పెళ్లీడుకొచ్చిన అమ్మాయి కోసం వరుడి కోసం వెతకడం కామన్.. ప్రస్తుత టెక్ యుగంలో ఈ పని మరింత సులభతరం అయ్యింది. వివాహ సంబంధాలు చూసేందుకు మొన్నటి వరకు మ్యారేజీ బ్యూరోలు ఉండగా

Groom for Sale: అరుదైన సంప్రదాయం.. అంగట్లో అమ్మాకానికి పెళ్లి కుమారులు.. వివరాలు తెలిస్తే మతిపోవాల్సిందే..
Groom For Sale
Follow us on

Groom for Sale: పెళ్లీడుకొచ్చిన అమ్మాయి కోసం వరుడి కోసం వెతకడం కామన్.. ప్రస్తుత టెక్ యుగంలో ఈ పని మరింత సులభతరం అయ్యింది. వివాహ సంబంధాలు చూసేందుకు మొన్నటి వరకు మ్యారేజీ బ్యూరోలు ఉండగా, ఇప్పుడు మ్యాట్రీమోని సైట్స్ వచ్చాయి. ఆన్‌లైన్‌లో ఒక్క క్లిక్‌తో వధువు, వరుడు అందరూ అందబాటులోకి వచ్చేస్తున్నారు. అయితే, ఇవి సెలక్షన్ మాత్రమే. మరి వరుడిని మార్కెట్‌లో అమ్మాకానికి పెట్టడం గురించి ఎప్పుడైనా విన్నారా? అవును, వరుడిని అంగట్లో అమ్మకానికి పెట్టారు. అయితే, ఇది తరతరాలుగా వస్తున్న వింత ఆచారం. ఈ విచిత్ర ఆచారం.. బిహార్‌లోని మధుబని జిల్లాలో ఉంది. ఈ సంప్రదాయం 700 ఏళ్లుగా కొనసాగుతోందని స్థానికులు చెబుతున్నారు. అంగడి/సంత మాదిరిగా రావి చెట్టు కింద పెళ్లికి సిద్ధపడిన యువకులను కూర్బోబెట్టి 9 రోజుల పాటు విక్రయానికి ఉంచుతారు.

ఈ వింత ఆచారానికి సంబంధించిన ఆసక్తికర వివరాలు ఇలా ఉన్నాయి. బిహార్ రాష్ట్రంలోని మధుబని జిల్లాలో ఓ వర్గం ప్రజలు “సౌరత్ సభ” పేరుతో వరులను విక్రయానికి పెడతారు. మైథిల్ బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందిన ప్రజలు తమ కుమార్తెలతో పాటు వచ్చి.. తమకు నచ్చిన వరులను ఎంపిక చేసుకుంటారు. వరులు సాంప్రదాయ క్రిమ్సన్ ధోతీ, కుర్తా లేదా షర్ట్స్ ని ధరించి, తమ సంరక్షకులతో పాటు మార్కెట్‌లో కూర్చుంటారు. వారి ధర.. వారి నేపథ్యం, విద్యార్హతల ఆధారంగా నిర్ణయిస్తారు. అయితే, వరుడిని ఎంపిక చేసుకునే ముందు.. వధువు తరఫున వారు వరుడి అర్హతలు, వారి కుటుంబ నేపథ్యాన్ని ధృవీకరించుకుంటారు. వారి జనన ధృవీకరణ పత్రాలు, పాఠశాల ధృవీకరణ పత్రాలు, మొదలైన వివరాలన్నీ సేకరిస్తారు. వధువు వరుడిని ఎంచుకున్న తరువాత.. తదుపరి చర్యలకై.. ఇరు కుటుంబాలు మాట్లాడుకుంటారు. అంతా ఓకే అయితే, అమ్మాయి తరఫువారే వివాహ క్రతువులను పూర్తి చేస్తారు.

కాగా, స్థానికుల కథనం ప్రకారం.. ఈ సంప్రదాయం కర్నాట్ రాజవంశస్థుల కాలం నుంచి ఆచరిస్తూ వస్తున్నారు. వివిధ గోత్రాల వ్యక్తుల మధ్య వివాహాలను సులభతరం చేయడానికి రాజా హరిసింగ్ ఈ మార్కెట్‌ను ప్రారంభించినట్లు చెబుతున్నారు. ఇందులో వరకట్న రహిత వివాహాలు చేయడం మరో లక్ష్యం. అయితే, ప్రస్తుతం పెళ్లిల్లో కట్నం ఇవ్వడం, తీసుకోవడం కామన్ అయిపోయిందని, ఈ సంప్రదాయ మార్కెట్ ఎంచుకునే వరుడికి కూడా కట్నం ఇస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..