Viral Video: ఫుల్లుగా తాగేసిన పెళ్లికొడుకు.. వధువుకు బదులుగా కాబోయే అత్త మెడలో.. వైరల్ వీడియో.!

|

Jun 04, 2021 | 5:15 PM

పెళ్లిలో వరుడు చేసిన బిత్తిరి పనికి వచ్చిన అతిథులంతా షాకయ్యారు. అతగాడి అవతారం చూసి.. పెళ్లినాడే ఇలా ఉంటే.. ఇక జీవితాంతం ఎలా ఉంటాడు..

Viral Video: ఫుల్లుగా తాగేసిన పెళ్లికొడుకు.. వధువుకు బదులుగా కాబోయే అత్త మెడలో.. వైరల్ వీడియో.!
Marriage
Follow us on

పెళ్లిలో వరుడు చేసిన బిత్తిరి పనికి వచ్చిన అతిథులంతా షాకయ్యారు. అతగాడి అవతారం చూసి.. పెళ్లినాడే ఇలా ఉంటే.. ఇక జీవితాంతం ఎలా ఉంటాడు అని అనుమానం వ్యక్తం చేశారు. ఇక ఆ వరుడు చేసిన ఘనకార్యానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతోంది. తప్పతాగి మండపానికి చేరుకున్న వరుడు వరమాలను అత్తమెడలో వేయబోయాడు. ఫుల్లుగా తాగి ఉండటంతో వరమాల మార్చుకునే సమయంలో.. వధువుకి బదులు ఆమె తల్లి.. అంటే కాబోయే అత్త మెడలో దండ వేయబోతాడు.

పక్కనున్న వారు దాన్ని గమనించి పెళ్లికొడుకుని పక్కకు జరిపారు. ఆ తర్వాత వరుడి స్నేహితులు అతడిని పట్టుకుని.. వధువు మెడలో వరమాల వేయించే ప్రయత్నం చేస్తారు. కానీ ఫుల్లుగా తాగి ఉండటంతో వధువు మెడలో వరమాల వేయకుండానే పెళ్లి మండపంలోనే కింద పడిపోతాడు. పెళ్లికి వచ్చిన వారంతా వరుడి వాలకం చూసి షాక్‌ అయ్యారు. అక్కడున్న స్థానికులు కొందరు ఇదంతా వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయటంతో తెగ హల్‌చల్‌ చేస్తోంది. ”వీడికిదేం పోయే కాలం.. పెళ్లి నాడు కూడా తప్పతాగి వచ్చాడు” అంటూ నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

Also Read:

బొటన వేలు కంటే పక్కన ఉండే వేలు పెద్దదిగా ఉందా.? మీ కాలి వేళ్లు భవిష్యత్తు గురించి ఏం చెబుతున్నాయో తెలుసా.!

ఈ ఆహార పదార్ధాలను పెరుగుతో పాటు అస్సలు తినకూడదు.! చాలా డేంజర్.. అవేంటంటే..

దట్టమైన అడవిలో ఊగుతూ కనిపించిన మర్మమైన బొమ్మ.. గగుర్పొడిచే దృశ్యం.. చివరికి ట్విస్ట్ ఏంటంటే.?