ఈరోజుల్లో సోషల్ మీడియా వల్ల ఏ చిన్న సంఘటన జరిగినా అది క్షణాల్లో తెలుస్తుంది. కొన్ని ఫన్నీ వీడియోస్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతుంటాయి. మరికొన్ని సంఘటనలు చూస్తే పగలబడి నవ్వుకుంటాం.. కొన్ని పెళ్లికి సంబంధించిన ఫన్నీ క్లీప్స్ చూస్తాం.. సామన్యంగా పెళ్లంటే గొడవలు జరుగుతుంటాయి.. కట్ చేస్తే పెళ్లి కొడుకు మాజీ లవర్ ఎంట్రీ ఇస్తుంది. ఇలాంటి దృశ్యాలు అప్పట్లో మనం సినిమాల్లో చూసేవాళ్లం.. పెళ్లిలో పెళ్లి కొడుకు బట్టతల చూసి పెళ్లి క్యాన్సిల్ అవ్వడం కూడా చూసుంటాం. మరికొన్ని చోట్ల కట్నం ఇవ్వలేదని పెళ్లిలు క్యాన్సిల్ అవుతుంటాయి. ఇలాంటివి నెటింట్లో తెగ వైరల్ అవుతూ ఉంటాయి.
ప్రస్తుతం అలాంటి ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ సందర్భంగా పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు సంతోషంతో చిందులు వేస్తున్నారు. వధువు తరపు బంధువులు, వరుడు తరపు బంధుపులు పెళ్లి వేడుకకు హాజరైయ్యారు. హుషారు మీదున్న పెళ్లి కొడుకు పెళ్లి కూతురిని ఎత్తుకొని చిందులు వేశాడు. ఎంతో జోష్‌తో ఎత్తుకున్న పెళ్లి కూతురిని పెళ్లి కొడుకు కిందికి దించేటప్పుడు ప్యాంట్ చిరిగిపోయింది. దీంతో వధువు కాబోయే వరుడిని ఆటపట్టించేందుకు ట్రై చేసింది. వరుడికి పలువురు కోట్లు అడ్డు పెట్టి ఇజ్జత్ కాపాడే ప్రయత్నం చేశారు. నెటింట్లో ట్రెండ్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్స్ రకరకలుగా స్పందిస్తున్నారు. మనకెందుకు భయ్యా ఇవన్నీ..పెళ్లాం ముందు పరువు పాయే అంటూ కామెంట్స్ పెడుతున్నారు.