వివాహాలలో వరుడు కట్నం తీసుకునే పద్ధతి చాలా కాలంగా కొనసాగుతోంది. ఈ దుష్ట సాంప్రదాయానికి వ్యతిరేకంగా టీవీ9 కూడా ఎన్నోసార్లు గళమెత్తింది. కానీ నేటికీ, చాలా ప్రాంతాలలో ఈ ఆటవిక వ్యవస్థ కొనసాగుతూనే ఉంది. పెళ్లి తంతు అప్పుడు మాత్రమే కాదు.. పెళ్లి తర్వాత కూడా మహిళలను కట్నం కోసం వేధిస్తున్నారు కొందరు. ఈ విధానానికి వ్యతిరేకంగా ఇప్పటికే ఎన్నో చట్టాలు వచ్చాయి.. అయినా మనుషుల మైండ్ సెట్ మాత్రం మారడం లేదు. తాజాగా పెళ్లి సందర్భంగా ఓ వరుడు వ్యవహరించిన తీరు తీవ్ర చర్చనీయాంశమైంది. కట్నం కింద ఒక వ్యక్తి తనకు బుల్లెట్ బైక్ కావాలని కోరాడు. కానీ, వధువు తరఫువాళ్లు మాత్రం అతడికి అపాచీ బైక్ ఇచ్చారు. దీంతో పెళ్లి రోజు అతడు హైడ్రామాకు తెరలేపాడు.
ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌కు చెందిన హత్రాస్‌లో చోటుచేసుకుంది. సైనికుడిగా పనిచేస్తూ.. అలీగఘడ్‌లోని క్వార్సీ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నివసిస్తున్న వ్యక్తికి… హత్రాస్‌లో నివశించే యువతితో వివాహం నిశ్చయించారు పెద్దలు. పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు కట్నం కింద 10 లక్షలు ఇవ్వాలని కోరారు. అందుకు వధువు తరఫు వాళ్లు అంగీకారం తెలిపారు. అయితే పెళ్లి కొడుకు తనకు వివాహానికి ముందే బుల్లెట్ ఇవ్వాలని కోరాడు. కానీ, అత్తమామలు అతనికి అపాచీ బైక్ ఇచ్చారు. పెళ్లి రోజున బైక్ కీని అతడి చేతిలో పెట్టారు. దీంతో ఊరేగింపుతో అక్కడికి చేరకున్న వరుడు అగ్గిమీద గుగ్గిళం అయ్యాయి. వెంటనే గుర్రంపై నుంచి కిందకు దిగి డ్రామా ప్రారంభించాడు. అతను తన దుస్తులను తీసివేసి, అండర్ గార్మెంట్స్‌తో అందరి ముందు నిలబడ్డాడు. ఆ సమయంలో అతను మద్యం సేవించినట్లు చెబుతున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. ఇరు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ ఎవరూ మాట వినే పరిస్థితిలో లేరు. దీంతో చేసేదేమీ లేక.. కేసు పెడితే విచారిస్తామని చెప్పి వెళ్లిపోయారు.
Also Read: ఆ జంతువులను చూడగానే తోకముడిచి లగెత్తిన సింహాలు.. ప్రాణభయంతో పరుగో పరుగు
ఎద్దుపై చిరుత మెరుపుదాడి.. ఒకటి మెడపట్టగానే… నాలుగు చుట్టుముట్టాయి..ఇక