వధువు నుదిటిపై సింధూరం పెడుతూ వరుడి చిలిపి పని.. దెబ్బకు అంతా షాక్.. వీడియో చూసేయండి..

సాధారణంగా పెళ్లిళ్లలో వధూవరుల ఫ్రెండ్స్ అల్లరి అంతా ఇంతా ఉండదు. సందు దొరికితే చాలు.. వధూవరులను ఆటపట్టిస్తుంటారు.

వధువు నుదిటిపై సింధూరం పెడుతూ వరుడి చిలిపి పని.. దెబ్బకు అంతా షాక్.. వీడియో చూసేయండి..
Marriage Video

Updated on: Oct 17, 2022 | 1:31 PM

పెళ్లిళ్ల సీజన్‌తో సంబంధం లేకుండానే నెట్టింట మ్యారేజ్ వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. ఎప్పుడు కావాలంటే.. అప్పుడు ఓ లుక్కేయొచ్చు. సాధారణంగా పెళ్లిళ్లలో వధూవరుల ఫ్రెండ్స్ అల్లరి అంతా ఇంతా ఉండదు. సందు దొరికితే చాలు.. వధూవరులను ఆటపట్టిస్తుంటారు. అయితే ఇక్కడ కొంచెం డిఫరెంట్‌గా పెళ్లి జరుగుతుండగా వరుడు చేసిన ఓ చిలిపి పని వీడియోకు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ప్రస్తుతం ఆ వీడియో ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది.

వైరల్ వీడియో ప్రకారం..వధూవరులది లవ్ మ్యారేజ్ అని చెప్పొచ్చు. పెళ్లి జరుగుతున్న సమయంలో పురోహితుడి సూచనలు పాటిస్తున్న వరుడు. ఈ క్రమంలోనే వధువుకు సింధూరం పెడుతూ ఓ చిలిపి పని చేశాడు. తనకు నచ్చిన అమ్మాయి.. వైఫ్‌గా వస్తుండటంతో మనోడి సంతోషానికి అవధులు లేవు. అది గుర్తొచ్చినట్లు ఉంది వరుడికి.. అంతే! వధువు నుదిటిపై సింధూరం పెడుతూ చిలిపిగా ఆమె బుగ్గపై ఓ ముద్దు ఇచ్చాడు. దీనితో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ కాగా.. వధువు సిగ్గుతో నవ్వుతూ తల దించుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

కాగా, ‘wedlookmagazine’ అనే ఇన్‌స్టా పేజీ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Follow Us