Viral Video: వధువు స్వీట్ పెడుతుంటే.. ముఖం తిప్పేసుకున్న వరుడు.. ఆగ్రహిస్తున్న నెటిజన్లు.!

Viral Video: పెళ్లంటే నూరేళ్ల పంట. వివాహ వేడుకలో జరిగే ప్రతీ మూమెంట్ ఓ అద్భుతం. అందుకే ప్రతీ ఒక్కరూ కూడా తమ వివాహం జీవితాంతం గుర్తుండిపోయేలా..

Viral Video: వధువు స్వీట్ పెడుతుంటే.. ముఖం తిప్పేసుకున్న వరుడు.. ఆగ్రహిస్తున్న నెటిజన్లు.!
Marriage

Updated on: Oct 05, 2021 | 3:24 PM

పెళ్లంటే నూరేళ్ల పంట. వివాహ వేడుకలో జరిగే ప్రతీ మూమెంట్ ఓ అద్భుతం. అందుకే ప్రతీ ఒక్కరూ కూడా తమ వివాహం జీవితాంతం గుర్తుండిపోయేలా జరగాలని కోరుకుంటారు. ఇక వివాహం కలకాలం నిలవాలంటే ఒకరిపై ఒకరికి గౌరవం ఉండాలి. ఇదిలా ఉంటే.. ఇంటర్నెట్‌లో పెళ్లికి సంబంధించిన వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఎక్కువగా నెటిజన్లు ఇష్టపడే కంటెంట్ కూడా ఇదేనని చెప్పొచ్చు. తాజాగా ఆ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ హల్చల్ చేస్తోంది.

వైరల్ వీడియో ప్రకారం.. వేదికపై ఉన్న వరుడు ముభావంగా ఉన్నట్లు మీరు చూడవచ్చు. వధువు స్వీట్‌ పెట్టేందుకు ప్రయత్నించినా.. తనకు ఇష్టం లేదనట్లు ముఖాన్ని పక్కకు తిప్పేసుకుంటాడు. వరుడు ప్రవర్తనకు వధువు చిన్న బుచ్చుకుంది. ఇక పెళ్లి వేదికపై వధువుతో వరుడు ప్రవర్తించిన విధానం నెటిజన్లు ఎవ్వరికీ నచ్చలేదు.

ఈ వీడియో చూసిన వారందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పోస్టు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దాదాపు నిమిషం నిడివి కలిగిన ఈ వీడియోను ‘Ekmohabbataishibhi’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అప్‌లోడ్ చేసింది. దీనిని 17,630 మంది వీక్షకులు లైక్ చేశారు. ‘ఈ వివాహం పెళ్లి కొడుక్కి ఇష్టం లేదనిపిస్తోందని’ ఒకరు కామెంట్ చేయగా.. ‘గుట్కా తిన్నట్లు ఉన్నాడంటూ’ మరొకరు కామెంట్ చేశారు.

Also Read:

Loading...
Unable to load recommendations.
Follow Us