Viral Video: పొట్టుపొట్టుగా తాగాడు.. వధువు మెడలో దండ వేయబోయి.. వరుడి వీడియో వైరల్

|

Jun 01, 2021 | 8:33 PM

Groom Funny Video: సోషల్ మీడియాలో తరచూ కొన్ని వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్నింటిని చూస్తే మనం తెగ నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తుంటాం. అయితే ఇలాంటి వీడియోల వల్ల మనం.. అలాంటి పని చేయకూడదనే

Viral Video: పొట్టుపొట్టుగా తాగాడు.. వధువు మెడలో దండ వేయబోయి.. వరుడి వీడియో వైరల్
Groom Funny Video
Follow us on

Groom Funny Video: సోషల్ మీడియాలో తరచూ కొన్ని వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్నింటిని చూస్తే మనం తెగ నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తుంటాం. అయితే ఇలాంటి వీడియోల వల్ల మనం.. అలాంటి పని చేయకూడదనే ఆలోచన కూడా మదిలో మెదులుతుంది. అయితే ఈ వీడియో చూస్తే.. ఇక ఫుల్లుగా మందు తాగి ఏ పని కూడా చేయకుడదని ఓ నిర్ణయానికి సైతం వస్తారు. అంతేకాకుండా కడుపుబ్బా నవ్వుకుంటారు. ఓ వ్యక్తి తన వివాహం సందర్బంగా ఫుల్లుగా మద్యం తాగాడు. దండలు మార్చుకునే సమయానికి అతని మత్తు రెండింతలైంది. చివరకు ఏం జరిగిందో చూస్తే మీరు నవ్వుకుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి అందరూ తెగ కామెంట్లు చేస్తున్నారు.

ఏ అబ్బాయికైనా.. పెళ్లి రోజు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆ రోజును చిరస్మరణీయంగా మార్చేందుకు తెగ కసరత్తులు చేస్తుంటారు. అయితే ఈ వ్యక్తి మాత్రం అవేమి పట్టించుకోకుండా ఫుల్లుగా తాగి మైకంలోకి వెళ్లిపోయాడు. దండలు మార్చుకునే సమయం వచ్చింది నిలబడ్డాడు కానీ.. పక్కనున్న మహిళకు దండవేయబోయాడు. గమనించిన ఆమె అడ్డుకుంది. మళ్లీ అంతలోనే తనతప్పును గ్రహించిన ఆ యువకుడు పెళ్లి కూతురుకు దండవేయబోతాడు. ఈ క్రమంలో నిలబడలేక వరుడు కిందపడిపోతాడు. ఓ సారి ఈ ఫన్నీ వీడియో చూడండి మీకే తెలుస్తుంది.

ఫన్నీ వీడియో..

Also Read:

ఆ తండ్రికి ఎంత కష్టం.. కుమారుడికి రక్తం కోసం సైకిల్‌పై ఏకంగా 400 కి.మీ ప్రయాణం.. ఎక్కడంటే..?

బేఫికర్ ! కోవిద్ రూల్స్ కి ‘పాతర’…కూతురి ప్రీ-వెడ్డింగ్ పార్టీలో బీజేపీ ఎమ్మెల్యే ‘జాతర’…60 మందిపై కేసు నమోదు