Viral Video: గూగుల్‌లో పనిచేస్తున్న యువతి.. తల్లిదండ్రులకు తన ఆఫీస్‌ చూపించింది..! ఆ తర్వాత జరిగింది చూస్తే..

ఒక కూతురు తన తల్లిదండ్రులను తను పనిచేస్తున్న ఆఫీసుకి తీసుకెళ్లింది. ఆ క్షణంలో వారి ఆనందాన్ని మాటాల్లో వర్ణించలేం. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసి జనాలు భావోద్వేగానికి గురయ్యారు. ఇది వారు సాధించిన నిజమైన విజయంగా ప్రతి ఒక్కరూ వర్ణించారు. ఈ భావోద్వేగ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అందరి హృదయాలను గెలుచుకుంటోంది.

Viral Video: గూగుల్‌లో పనిచేస్తున్న యువతి.. తల్లిదండ్రులకు తన ఆఫీస్‌ చూపించింది..! ఆ తర్వాత జరిగింది చూస్తే..
Proud Parents Viral Video

Updated on: Dec 31, 2025 | 7:41 PM

గూగుల్‌లో పనిచేస్తున్న ఒక టెక్ ప్రొఫెషనల్ తన జీవితంలోని అత్యంత ప్రత్యేకమైన క్షణాలలో ఒకదాన్ని ఇంటర్‌నెట్‌లో షేర్‌ చేశారు. ఈ భావోద్వేగ, హృదయాల్ని హత్తుకునే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆమె తన తల్లిదండ్రులకు మొదటిసారిగా గూగుల్ కార్యాలయాన్ని చూపిస్తుంది. ప్రగ్యగా అనే టెక్నీషియన్ తను పనిచేస్తున్న గూగుల్‌ ఆఫీస్‌లోని వివిధ భాగాలను తన తల్లిదండ్రులకు చూపిస్తుంది. అదంతా చూసిన అమ్మనాన్నలు గర్వంతో ఉప్పొంగిపోయారు. కళ్ల నిండా నిండిపోయిన కన్నీళ్లతో వారు సంతోషంలో మునిగి తేలారు.

ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ, ప్రగ్య ఎంతో భావోద్వేగంతో కూడిన క్యాప్షన్ రాసింది. ప్రతి కష్ట సమయంలోనూ తన తల్లిదండ్రులు, సోదరుడు తనకు మద్దతు ఇచ్చారని ఆమె వివరించింది. తనను తాను నమ్ముకోకపోయినా, తన తల్లిదండ్రులు తనను నమ్ముకున్నారని ఆమె రాసింది. అందువల్ల, తాను పనిచేసే, ప్రదేశానికి తన తల్లిదండ్రులను తీసుకెళ్లినప్పుడు వారి ముఖాల్లోని ఆనందాన్ని చూసినప్పుడు తనకు మాటలలో చెప్పలేని ప్రశాంతత వచ్చిందని ప్రగ్యా రాశారు. తన కృషి, విజయమంతా తన తల్లిదండ్రులకే ఆపాదించబడింది. ఈ భావోద్వేగ సందేశం ప్రజల హృదయాలను తాకింది.

ఇవి కూడా చదవండి

ఇంటర్‌నెట్‌లో వీడియో వేగంగా వైరల్ అయింది. ఈ వీడియోను 200,000 సార్లు వీక్షించారు. వేలాది మంది దీన్ని లైక్ చేశారు. వినియోగదారులు కామెంట్‌ సెక్షన్‌లో ప్రేమను కురిపించారు. తల్లిదండ్రులు తమ కూతురిని చూసి ఎంత గర్వపడతారో ఒక యూజర్ రాశారు. మరొకరు తమ తల్లిదండ్రులను గూగుల్ ఆఫీసుకు తీసుకెళ్లినప్పుడు కూడా అదే అనుభూతిని అనుభవించారని పంచుకున్నారు.

ఇటీవల, స్కాట్లాండ్‌లో పనిచేస్తున్న ఒక యువ భారతీయుడు తన తల్లిదండ్రులు తన కార్యాలయాన్ని సందర్శించిన ఇలాంటి వీడియోను షేర్ చేశాడు. అక్కడ, వారు అతని సహోద్యోగులను కలుసుకున్నారు. వారి కొడుకు కష్టపడి పనిచేయడాన్ని దగ్గరగా చూశారు. ఈ వీడియో కేవలం కార్యాలయాన్ని సందర్శించడం మాత్రమే కాదు, తల్లిదండ్రులు తమ పిల్లల కోసం చేసిన త్యాగం, నమ్మకం, కలల కథ. అందుకే ఈ వీడియో ప్రతి ఒక్కరినీ కదిలించింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..