AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఇదెక్కడి వింత మావా.! అద్దెకు అమ్మాయిలు, మహిళలు.. మన దేశంలోనే.. ఎక్కడో తెలుసా

ఇది విన్నారా.! మన దేశంలోని ఆ ప్రాంతంలో అద్దెకు అమ్మాయిలు, మహిళలు లభిస్తారట. ఇది మరీ దారుణం కదా..! ఇంతకీ ఆ ప్రాంతం మన దేశంలో ఎక్కడుందో మీకు తెల్సా.. ఈ స్టోరీ వింటే మీరు షాక్ అవ్వడం ఖాయం.. ఓసారి లుక్కేయండి.

Viral: ఇదెక్కడి వింత మావా.! అద్దెకు అమ్మాయిలు, మహిళలు.. మన దేశంలోనే.. ఎక్కడో తెలుసా
Representative Image
Ravi Kiran
|

Updated on: Jan 25, 2025 | 5:18 PM

Share

మన దేశంలోని పలు రాష్ట్రాల్లో మహిళలు అద్దెకు దొరుకుతారన్న విషయం మీకు తెలుసా? మనకు నచ్చిన వారిని కొంతకాలానికి అద్దెకు తీసుకోవచ్చు. ఆపై వారిని తిరిగి వెనక్కి ఇచ్చేయాల్సి ఉంటుంది. ఈ వ్యవహారమంతా చాలా పకడ్బందీగా జరుగుతుంది. స్టాంప్ పేపర్లపై అగ్రిమెంట్ వంటి తతంగం కూడా ఉంటుంది. ఇందుకోసం ప్రత్యక్షంగా సంత నిర్వహించడం మరో విశేషం. మధ్యప్రదేశ్‌లోని శివపురిలో ధడీచా పేరుతో ఈ సంత నిర్వహిస్తారు. ప్రతి ఏడాది నిర్ణీత సమయంలో జరిగే ఈ సంతలో యువతులు, మహిళలను అద్దెకు తీసుకోవచ్చు. ఈ సంతకు సుదూర ప్రాంతాల నుంచి కూడా వస్తుంటారు. నచ్చిన అమ్మాయిని నెలలు, సంవత్సరాల చొప్పున అద్దెకు తీసుకుంటారు.

ఇక్కడికి వచ్చేవారు రూ. 15 వేలతో మొదలుపెట్టి లక్షల అద్దె చెల్లించేందుకు సిద్ధపడతారు. కన్యలకు మరింత ఎక్కువ ధర పలుకుతుంది. అయితే, ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించే హక్కు ఆ మహిళలకు ఉంటుంది. అద్దెకు వెళ్లిన ఇంట్లో తనకు ఇబ్బందులు ఎదురైనా, అసౌకర్యంగా అనిపించినా, ఇంకే కారణంతోనైనా ఆమె తన ఒప్పందాన్ని రద్దు చేసుకోవచ్చు. ఒప్పందంలో ఈ విషయాన్ని స్పష్టంగా రాస్తారు. పెళ్లికి తగిన యువతి దొరకని వారు, ఇంట్లోని వయోవృద్ధుల సంరక్షణ కోసం కూడా మహిళలను ఇలా అద్దెకు తీసుకుంటారు. ఇలాంటి ఆచారమే రాజస్థాన్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లోని కొన్ని సామాజిక వర్గాల్లో ఉంది. రాజస్థాన్‌లో దీనిని ‘నటప్రత’ అని పిలుస్తారు.

‘నటప్రత’పై ఇటీవల తరచూ మీడియాలో వార్తలు వస్తుండటంతో జాతీయ మానవహక్కుల సంఘం తీవ్రంగా స్పందించింది. ఇదెక్కడి ఆచారమంటూ విస్తుపోయింది. దీనిని అరికట్టే చర్యలు చేపట్టాలంటూ కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖతోపాటు ఆ నాలుగు రాష్ట్రాలను కోరింది. గతంలో దీనిపై రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్‌ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి నుంచి ఫిర్యాదులు కూడా అందాయి. తన కుమార్తెను కిడ్నాప్ చేశారని ఆయన ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో పలు సంచలన విషయాలు బయటపడటంతో ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ ఆచారం మహిళలను కించపరిచేలా ఉందని, దీనిని రద్దు చేయాలంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..