కచోరిలో ఉల్లిపాయ లేదని యువతి రచ్చ.. ఒక్కొక్కరికి చుక్కలు చూపించిన అమ్మాయి.. షాకింగ్ వీడియో..

|

Nov 09, 2021 | 9:20 AM

పానీ పూరి అంటే అమ్మాయిలకు చెప్పలేనంత ఇష్టం. ఇక పానీ పూరిని ఎంతో ఇష్టంగా ఆస్వాదిస్తూ తింటుంటారు. అలాగే..

కచోరిలో ఉల్లిపాయ లేదని యువతి రచ్చ.. ఒక్కొక్కరికి చుక్కలు చూపించిన అమ్మాయి.. షాకింగ్ వీడియో..
Viral '
Follow us on

పానీ పూరి అంటే అమ్మాయిలకు చెప్పలేనంత ఇష్టం. ఇక పానీ పూరిని ఎంతో ఇష్టంగా ఆస్వాదిస్తూ తింటుంటారు. అలాగే.. కచోరి కూడా వారికి ఫేవరేట్ ఫుడ్. అయితే ఓ అమ్మాయి కచోరిలోకి ఉల్లిపాయ లేదని నడిరోడ్డుపై రచ్చ చేసింది. కచోరి విక్రయిస్తున్న వ్యక్తిని ఇష్టానుసారంగా తిడుతూ.. అతనితో గొడవకు దిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

రోడ్డుపై ఉన్న ఓ పానీపూరి షాప్ దగ్గర ఓ అమ్మాయి కచోరి తింటోంది. అయితే అందులోకి ఉల్లిపాయలు కావాలని ఆ షాప్ వ్యక్తిని అడగ్గా.. అతను లేదని సమాధానమిచ్చాడు. అంతే ఆ యువతి ఆవేశంతో ఊగిపోయింది. అతడిని ఇష్టానుసారంగా తిడుతూ.. గొడవకు దిగింది. అతనితోపాటు.. అక్కడున్నవారందరూ వద్దని వారిస్తున్నా… ఆ వ్యక్తిపై కోపంతో విరుచుకుపడింది. అంతేకాదు… ఆ కచోరి విక్రయిస్తున్న వ్యక్తి సైకిల్‏ను తన్నింది. దీంతో అందులోని వస్తువులన్ని కిందపడిపోయాయి. అప్పటికీ ఆ యువతి కోపం కంట్రోల్ కాలేదు.. ఆ వ్యక్తిని చెంపపై కొడుతూ దూషణలకు దిగింది. పక్కనే ఉన్నవారు ఆ అమ్మాయి తీరుని తప్పుబట్టడంతో వారిపై సైతం ఆ యువతి విరుచుపడింది. ఈ తతంగాన్ని మొత్తం అక్కడే ఉన్న ఓ వ్యక్తి రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్త వైరల్ అవుతుంది. ఇందులోని అమ్మాయి ప్రవర్తన చూసిన నెటిజన్స్.. తనపై చర్యలు తీసుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read:  Adipurush: ఆదిపురుష్ కోసం తన పార్ట్ కంప్లీట్ చేసిన ఇంద్రజిత్.. ఎప్పటికీ మర్చిపోలేనంటూ..

Jai Bhim – Raghava Lawrence: మరోసారి దాతృత్వం చాటుకున్న లారెన్స్.. జై భీమ్ రియల్ ‘సినతల్లి’కి భారీ సాయం..

Pradeep Machiraju: మహాభారత యుద్ధంలో కౌరవ..పాండవ సేనకు భోజనం పెట్టింది ఎవరు? ఆహా..అనిపించిన ప్రదీప్!

Bandla Ganesh: ఈ స్టార్ ప్రొడ్యూసర్ ఇక పై హీరోగా కంటిన్యూ అవుతారా.. బండ్ల నటనకు ఫిదా అవుతున్న ప్రేక్షకలు..