పెళ్లి వేడుకలో బంధువులు.. స్నేహితులతో ఎంతో సందడిగా ఉంటుంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా వివాహ వేడుకలో ప్రతి చిన్న క్షణాన్ని ఆనందంగా గడిపేస్తుంటారు. అయితే పెళ్లి జరుగుతున్న సమయంలో కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతుంటాయి. అవి కొన్ని సందర్బాల్లో నవ్వులు పూయించిన.. మరికొన్ని సందర్భాల్లో ఆశ్చర్యంగా అనిపిస్తుంటాయి. ఇటీవల పెళ్లి వేడుకలకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గత కొద్ది రోజులుగా నెట్టింట్లో మ్యారెజ్ ఫన్నీ వీడియోస్ చక్కర్లు కొడుతున్నాయి. అందులో కడుపు చక్కెలయ్యేలా కొన్ని సంఘటనలు ఉండగా.. మరికొన్ని మాత్రం అయ్యో పాపం… ఎంత పనాయే అన్నట్లుగా ఉంటాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫన్నీ వీడియో చక్కర్లు కొడుతుంది. నిజమే.. ఆ వీడియో చూస్తే మీరు పొట్టచెక్కలయ్యేలా నవ్వడం మాత్రం ఖాయం. ఇంతకీ ఏం జరిగిందనుకుంటున్నారా? అయితే మీరే తెలుసుకోండి..
ఆ వీడియోలో పెళ్లి వేడుకగా ఎంతో ఘనంగా జరుగుతుంది. వధువు కూర్చుని ఉండగా.. ఆమె చుట్టు బంధువులు.. స్నేహితులు ఉన్నారు. అలాగే అక్కడే ఉన్న పురోహితుడు వరుడి చేతులతో వధువుకు సింధూరం పెట్టే ఘట్టాన్ని జరిపిస్తున్నాడు. అయితే వరుడు.. వధువు తలపై కుంకుమ పెట్టడానికి అతను ముందుగు వచ్చినప్పుడు అక్కడే ఉన్న ఓ అమ్మాయి ఆకస్మాత్తుగా వరుడి మెడలో వరమాల వేయడానికి ప్రయత్నించింది. దీంతో వరుడు ఒక్కసారిగా వెనకకు జరిగాడు. ఇంకేముంది.. పురోహితుడు.. వధువు పై నుంచి ఆ అమ్మాయ బొక్క బోర్లా పడింది. ఈ ఘటనతో అక్కడున్నవారు పగలబడి నవ్వారు. అయితే ఇది ఎప్పుడు ఎక్కడ జరిగిందనేది మాత్రం తెలియరాలేదు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు. మీరు ఆ ఫన్నీ వీడియోను చూసేయ్యండి.
Also Read: Shanmukh Jashwanth: దీప్తితో బ్రేకప్ పై షణ్ముఖ్ షాకింగ్ కామెంట్స్.. అసలు కారణం ఇదే అంటూ..
Megha Akash: కూతురు సినిమా కోసం తల్లి మరో సాహసం.. ప్రొడ్యూసర్గా మారిన హీరోయిన్ మేఘ ఆకాష్ మథర్..
Aadavaallu Meeku Johaarlu: ఓ మై ఆద్యా పాటకు భారీ రెస్పాన్స్.. శర్వా, రష్మిక వాలెంటైన్స్ ట్రీట్..