Viral Video: బయటకు పో.. ఓ పోలీసు అధికారిణిపై రెచ్చిపోయిన మహిళా కమిషన్ చైర్‌పర్సన్..వీడియో వైరల్..

|

Sep 10, 2022 | 4:52 PM

పొరపాట్లు జరగడం సహజం.. అలాంటప్పుడు కింది స్థాయి అధికారులను పై స్థాయి అధికారులు మందలించడం సహజం. ఈమదలింపునకు ఓ పరిమితి ఉంటుంది. పరిమితి దాటితే అది రచ్చవుతుంది. అధికారం..

Viral Video: బయటకు పో.. ఓ పోలీసు అధికారిణిపై రెచ్చిపోయిన మహిళా కమిషన్ చైర్‌పర్సన్..వీడియో వైరల్..
Renu Bhatia
Follow us on

Viral News: పొరపాట్లు జరగడం సహజం.. అలాంటప్పుడు కింది స్థాయి అధికారులను పై స్థాయి అధికారులు మందలించడం సహజం. ఈమదలింపునకు ఓ పరిమితి ఉంటుంది. పరిమితి దాటితే అది రచ్చవుతుంది. అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు చేస్తే అది మన పరువు తీసేస్తుంది. సరిగ్గా ఇలాంటి ఘటనే హర్యానాలో జరిగింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ ఈమీడియాలో వైరల్ అవుతోంది. హర్యానాలోని కైతాల్ లో మహిళలకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా జరుగుతున్న సమావేశంలో మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రేణు భాటియా, పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఇదే సమయంలో ఓ భార్య, భర్తల మధ్య వివాహ బంధానికి సంబంధించిన కేసు విచారణకు వచ్చింది. ఈసందర్భంగా హర్యానా మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేణు భాటియా.. ఓ మహిళా పోలీస్ అధికారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మహిళా పోలీసు అధికారిపై రేణు భాటియా తన అధికార మదాన్ని చూపించి రెచ్చిపోయారు. ఈఘటన కెమెరాల్లో రికార్డు అయింది.

మహిళా పోలీసు అధికారిని రేణు భాటియా బయటకి పో.. ఆమెను బయటకి పంపండి అంటూ స్థానికు పోలీసు సిబ్బందిని ఆదేశించారు. మహిళా పోలీసు అధికారి ఏదో చెప్తే ప్రయత్నం చేస్తుండగా.. మీరు బయటకు వేళ్లండి.. మీ పై శాఖపరమైన చర్యలు తప్పవంటూ బిగ్గరగా అరవడం వీడియోలో కనిపిస్తోంది. ఇప్పుడు ఈవీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఏమైందంటే శారీరకంగా తాను సరిగ్గా లేనని భర్త వేధిస్తున్నాడని, తన నుంచి విడాకులు కోరుతున్నాడని ఓ మహిళ రేణు భాటియాకు ఫిర్యాదు చేసింది. తనకు మూడుసార్లు వైద్య పరీక్షలు నిర్వహించారని తెలియజేసింది. కానీ ఆమె భర్త ఒక్కసారి కూడా టెస్టులు చేయించుకోలేదని తెలిపింది. దీంతో ఒక్కసారిగా రేణు భాటియా ఈవిషయమై పోలీసు అధికారిని ప్రశ్నించారు. భర్తకు ఎందుకు పరీక్షలు చేయించలేదని అడిగారు. దీనిపై ఆ మహిళా పోలీసు అధికారి వివరణ ఇవ్వబోతుండగా.. గెట్ అవుట్ అని రేణు భాటియా బిగ్గరగా అరుస్తూ చెప్పారు.

ఇవి కూడా చదవండి

మీరు చెప్పేది నేను వినద‌ల్చుకోలేదు. బయటకు వెళ్లండి.. తిరిగి సమాధానం చెప్పవద్దంటూ రేణు భాటియా అన్నారు. పైగా మీరు విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీంతో మహిళా పోలీసు అధికారి రేణు భాటియాటతో వాదనకు దిగారు. ఇదంతా జరుగుతున్నప్పుడు ఎంతో మంది పోలీసు అధికారులు చుట్టూ ఉన్నారు. వారంతా మహిళా పోలీసు అధికారిని బయటకు వెళ్లాలని సూచించారు.ఇప్పుడు ఈవీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈఘటనపై హర్యానా మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రేణు భాటియా మీడియాతో మాట్లాడుతూ.. ఓ మహిళకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే తాను అలా రియాక్ట్ అయ్యానని చెప్పుకొచ్చారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..