Viral Video: మొసలితో పరాచకాలా.. దెబ్బకు మడతెట్టేసింది.. వీడియో చూస్తే అవాక్కే!

|

May 18, 2022 | 8:45 AM

సింహం, పులి, చిరుత వేట ఎంత భయానకంగా ఉంటుందో.. మొసలి వేట కూడా అంతే.! దెబ్బకు మొసలికి దొరికితే.. ఈజీగా మట్టుబెట్టేస్తుంది. అలాంటి వీడియో ఒకటి..

Viral Video: మొసలితో పరాచకాలా.. దెబ్బకు మడతెట్టేసింది.. వీడియో చూస్తే అవాక్కే!
Crocodile
Follow us on

నీటిలో మొసలికి వెయ్యి ఏనుగుల బలం ఉంటుంది. ఎంతటి బలశాలినైనా మట్టుపెట్టేస్తుందని అంటుంటారు. అదే మొసలి నీటి నుంచి బయటకొస్తే ఏం చేయలేదు.. దానికి బలమేమి ఉండదని అనుకుంటుంటారు. కానీ అది నిజం కాదు.. మొసలి ఎక్కడున్నా బలవంతమైనది.. దానితో పరాచకాలు ఆడారో దెబ్బకు చుక్కలు చూపిస్తుంది. ఇక అందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటో చూసేద్దాం..

వైరల్ వీడియో ప్రకారం.. ఓ మొసలి పచ్చని పొలం పక్కన చిన్న గొయ్యిలో ఎంచక్కా సేద తీరుతోంది. అక్కడికి ముగ్గురు వ్యక్తులు చేరుకొని దానితో పరాచకాలు ఆడేందుకు ప్రయత్నించారు. ఓ క్లాత్ మొసలి కళ్లకు అడ్డుగా పెట్టి దాన్ని పట్టుకోవాలని ఓ వ్యక్తి ట్రై చేశాడు. అది చూస్తూ ఊరుకుంటుందా.? దెబ్బకు ఎదురు తిరిగింది. తనతో ఆటలు ఆడుకోవాలని చూసిన వ్యక్తిని వెనక్కి పడేసి.. అతడి చేతిని కొరికేసింది. అయితే చాకచక్యంగా ఆ వ్యక్తి మాత్రం మొసలి నుంచి ఏదొకలా ప్రాణాలతో బయటపడ్డాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

కాగా, ఈ వీడియోను ‘jamie gnuman 197’ అనే నెటిజన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. దీనికి వేలల్లో వ్యూస్.. వరుసపెట్టి కామెంట్స్‌తో నెటిజన్లు హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ చూసేయండి..