Viral Video: చాలా మంది తమకు ఇష్టమైన జంతువులను ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. రకరకాల జంతువులను తమ ఇళ్లలో పెంచుకుంటూ ఉంటారు. సాధారణంగా కుక్కలను పిల్లులను చాలా మంది పెంచుకోవడానికి ఇష్టపడుతుంటారు. ఒకటి కంటే ఎక్కువ జంతువులను పెంచుకునే వారు కూడా ఉన్నారు. ఇంట్లో పెంచుకునే జంతువులు చాలా సరదాగా ఉంటాయి. కొన్ని జంతువులు ఒకరినొకరు ప్రేమిస్తాయి, కొన్ని జంతువులు ఎప్పుడూ శత్రువుల్లా ఉంటాయి. కొందరు వ్యక్తులు ఆ పెంపుడు జంతువులకు సంబంధించిన అనేక వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం మనం తరచుగా చూస్తుంటాం. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
పెంపుడు జంతువులకు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. యోగ్ ట్విట్టర్ ఖాతా నుంచి వీడియో పోస్ట్ చేయబడింది. ఈ వైరల్ వీడియోలో.. ఇంటి లోపల ఒక పిల్లి , ఒక గొర్రె పిల్ల ఉన్నాయి. పిల్లి, గొర్రెపిల్లను కొట్టడానికి పరుగెత్తుతుంది. కానీ గొర్రెపిల్ల భయపడలేదు. పిల్లి పారిపోయి గోడ వెనుక దాక్కుంటుంది.. గొర్రెపిల్ల ఇంకా అలాగే నిలబడి ఉంది. వెంటనే పిల్లి వెనక్కి పరుగెత్తుకుంటూ వెళ్లి గొర్రె పైకి ఎక్కేందుకు ప్రయత్నించింది. ఆ వీడియోలో పిల్లి మళ్లీ అలా చేయడంతో భయంతో గొర్రెపిల్ల గదిలోకి పరిగెత్తుతోంది.
Most adorable duel between kid and kitten…?????? pic.twitter.com/AXUjrVCTJE
— ?o̴g̴ (@Yoda4ever) May 14, 2022
ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేసిన ఈ వీడియోకు చాలా వ్యూస్ వచ్చాయి. ఈ రెండు పెంపుడు జంతువులను చూసిన చాలా మంది ఫన్నీ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. చాలా మంది ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేశారు.
మరిన్ని ఇక్కడ చదవండి :