
హాలోవీన్.. యూరప్ దేశాలలో ఇదొక సాంప్రదాయ పండగ. భయంగొలిపే వివిధ దుస్తుల్లో ఒకరినొకరు భయపెట్టుకోవడం ఈ పండగ ప్రత్యేకత. పాశ్చాత్య దేశాలకే పరిమితమైన ఈ పండగ ఇప్పుడు దేశంలోనూ ప్రవేశించింది. ఈ సండగ సందర్భంగా విచిత్రమైన వేషధారణతో పార్టీల్లోనూ, రోడ్ల మీద తిరుగతూ సందడి చేస్తుంటారు. నిజానికి ఈ పండగ ఆత్మలను భయపెట్టడానికి ప్రారంభించారు. ఈ సంప్రదాయం పాశ్చాత్య దేశాల్లో రెండు వేల సంవత్సరాలకు పూర్వమే ప్రారంభమైందని చరిత్ర చెబుతోంది. ఆత్మలు భూమిపై సంచరించే సమయంలో బంధువుల ఇళ్లలోకి ప్రవేశించకుండా భయంకర రూపాల్లో బొమ్మలు తయారు చేసి ఇళ్ల బయట పెడుతుంటారు. ఆత్మలు తమ వద్దకు రాకుండా ఉండేందుకు తెల్ల దుస్తులు వేసుకొని ముఖానికి నల్లని రంగు పూసుకునేవారు. అలా ప్రారంభమైన ఈ సంప్రదాయం నేటికీ కొనసాగిస్తున్నారు.
అలాంటి ఓ హాలోవీన్ పార్టీకి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తే నవ్వాపుకోవడం దాదాపు అసాధ్యమే. ఎందుకంటే ఓ ఇంట్లోకి గోడ దూకి మరీ వచ్చిన ఓ ఎలుగు బంటి హాలోవీన్ బొమ్మ చూసి దడుసుకుని బొక్క బోర్లాపడింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ ఇంటి ఆవరణలో హాలోవిన్ గెటప్‌లో ఓ రిమోట్ కంట్రోల్డ్ బొమ్మను నిలబెట్టి ఉండటం మీరు వీడియోలో చూడొచ్చు.
i watched this video 10 times in a row🤣 pic.twitter.com/B7xzBV7H8v
— Next Level Skills (@NextSkillslevel) November 6, 2025
అయితే రాత్రి సమయంలో ఎవరూ లేని టైం చూసి ఓ ఎలుగుబంటి ఆ ఇంట్లోకి గోడ దూకి మరీ ప్రవేశించింది. గార్డెన్‌లో నిలబెట్టి ఉన్న ఆ బొమ్మ చూడడానికి మనిషి మాదిరి ఉండటంతో పాపం ఎలుగుబంటి దగ్గరకు వెళ్లింది. అంతే ఆ బొమ్మ లైట్లు ఒక్కసారిగా వెలిగి, పెద్దగా అరుపులు వినిపించాయి. దీంతో ఆ ఎలుగుబంటికి గుండె ఆగినంత పనైంది. దెబ్బకు షాక్‌తో అంతెత్తున ఎగిరి వెల్లకిలా పడిపోయింది. ఆ తర్వాత తేరుకుని మళ్లీ బొమ్మ దగ్గరికి వచ్చిన ఎలుగుబంటి అది బొమ్మని తెలుసుకోవడంతో దానికి పట్టరాని కోపం వచ్చింది. అంతే దాన్ని దబేలుమని ఒక్క తన్ను తన్ని అక్కడి నుంచి ఉడాయించింది. ఈ మొత్తం దృశ్యాలు ఆ ఇంటి సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అదికాస్తా వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు పొట్టచెక్కలయ్యేలా తెగ నవ్వేసుకుంటున్నారు. అసలు ఎలుగుబంటి అంతలా భయపడటం నమ్మలేకున్నామని కామెంట్ సెక్షన్‌లో పోస్టులు పెడుతున్నారు. మీరూ ఈ వీడియో చూసేయండి..
మరిన్ని ట్రెండింగ్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.