
పాములు.. గద్దలు, ముంగీసలు సహా తమ శత్రువుల నుంచి తప్పించుకునేందుకు ఎంతో జాగ్రత్తగా ఉంటాయి. ఎక్కువగా రాత్రిపూట వేటకు వెళ్లే పాములు ఎలుకలు, కప్పలను ప్రధానంగా వేటాడి ఆహారంగా తీసుకుంటాయి. నెట్టింట పాముల వీడియోలు తరచుగా వైరల్ అవుతుంటాయి, అందులో కొన్ని ఆశ్చర్యపరిచే దృశ్యాలను చూపుతుంటాయి. ఏదైనా ఎలుక లేదా కప్ప కనిపిస్తే చాలు.. పాములు వెంటనే వాటిని వేటాడి తినడానికి ప్రయత్నిస్తాయి. కానీ, ఇక్కడ పరిస్థితి పూర్తిగా రివర్స్ అయింది. ఒక పాము ఓ కప్పపై దాడి చేయబోతుండగా, ఆ కప్పే పాముపై విరుచుకుపడింది. ఈ దృశ్యం చూసినవారు అమ్మ బాబోయ్ అంటూ నోరెళ్లబెడుతున్నారు.
వీడియోలో కప్ప తనవైపు వచ్చిన పామును గట్టిగా పట్టుకుంది. ఆ తర్వాత దాన్ని వదిలిపెట్టకుండా నెమ్మదిగా తన నోటితో ఒడిసి పట్టి, చివరకు గుటుక్కున మింగేసింది. కప్ప నోటికి చిక్కిన పాము, ఈసారి తప్పించుకోలేక విలవిల్లాడిపోయింది. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్లు ఇది చూసి ఆశ్చర్యపోతూ, “కప్ప చాలా ధైర్యంగా ఉంది!”, “బాప్ రే.. ఎంత వయోలెంట్ కప్ప!” అంటూ కామెంట్లు చేస్తున్నారు. టైం వస్తే ఎవరైనా తిరగబడొచ్చని ఈ ఘటన నిరూపితం చేస్తోంది.
వీడియో దిగువన చూడండి..