Viral: ఓ అమ్మాయి, నలుగురు యువకులు.. సీన్ కట్ చేస్తే.. అసలు మ్యాటర్ ఇదే

రోడ్డు మీద నలుగురు అబ్బాయిలు పొట్టు పొట్టుగా కొట్టుకుంటున్నారు. పైగా పక్కనే ఓ అమ్మాయి ఉంది. అరుస్తూ.. ఈ గొడవను అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. మరి ఇంతకీ అసలు గొడవ ఎందుకు జరిగింది.? అసలు కారణం ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందామా మరి.

Viral: ఓ అమ్మాయి, నలుగురు యువకులు.. సీన్ కట్ చేస్తే.. అసలు మ్యాటర్ ఇదే
Viral

Edited By:

Updated on: Jun 21, 2025 | 1:10 PM

కొందరు యువకులు పెద్దమొత్తం కలిసి ఒక యువకుడిని టార్గెట్‌గా చేసుకుని తీవ్రస్థాయిలో దాడి చేస్తున్న ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది కూడా ఒక అమ్మాయి కోసం జరిగిన దాడిగా తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నోయిడాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కూడా కలకలం రేపింది. సుమారు 39 సెకన్ల పాటు దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక యువకుడిని కొంతమంది యువకులు తీవ్రంగా కొడుతూ కనిపించారు. ఈ సంఘటన నోయిడా సెక్టార్ 49 పోలీస్ స్టేషన్ పరిధిలోని సెక్టార్ 50లో చోటుచేసుకుంది. బాధిత యువకుడి స్నేహితురాలికి సంబంధించిన ఏదో విషయంలో ఈ దాడి జరిగినట్లు అక్కడివారు చెబుతున్నారు. పైగా ఆ అమ్మాయి కూడా ఘటనా స్థలంలోనే ఉన్నట్లు వీడియో ద్వారా తెలుస్తోంది. ఆ అమ్మాయి కేంద్రంగా జరిగిన ఈ వివాదం కాస్తా హింసాత్మక ఘటనగా మారింది. నడిరోడ్డుపై ఆ యువకులు బూతులు తిడుతూ, ఇష్టారీతిన దాడి చేస్తూ ఒక యువకుడిని టార్గెట్ చేసుకుని రెచ్చిపోయారు.

వారి దాడులకు ఆ యువకుడు ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోగా.. పక్కనే ఉన్న అమ్మాయి ఆపే ప్రయత్నం చేసింది. ఒక్కడిని చేసి చితకబాదడం చూసి ఆ అమ్మాయి వారిని నిలువరిస్తున్నా ఉపయోగం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే కోపంతో ఆ అమ్మాయి వారి దాడి నుంచి ఆ యువకుడిని కాపాడే ప్రయత్నాలు చేసింది. ఆపై అక్కడే ఉన్న కొంతమంది సెక్యూరిటీ గార్డులు ఈ విషయంలో జోక్యం చేసుకుని గొడవ సద్దుమణిగేలా ప్రయత్నాలు చేశారు. అనంతరం దాడి చేసిన యువకులు అక్కడి నుంచి పరారయ్యారు.

 

స్థానిక పోలీసులు ఈ విషయంలో కలగజేసుకుని ఘటనకు సంబంధించి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండు వర్గాలకు చెందిన స్నేహితుల మధ్య ఈ గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఓ అమ్మాయి విషయంలో ఇరు వర్గాలకు వచ్చిన బేదాభిప్రాయాల కారణంగానే గొడవ జరిగినట్లు సమాచారం. కానీ, దీనిపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..