Trending Puzzle: కొన్నిసార్లు మన కళ్లు మనల్ని చీట్ చేస్తుంటాయి. మనకు కనిపించే విషయం.. ట్రూత్ చాలా వేరుగా ఉంటాయి. ఓ ఫోటోను చూడగానే అందులో ఏమీ కనిపించవు. ఏముంది నార్మల్ ఫోటోనేగా అనిపిస్తుంది. కానీ నెమ్మదిగా పరీక్షగా చూస్తే.. వాటిలో ఏమేమి దాగున్నాయో కనిపిస్తాయి. వీటినే ఆప్టికల్ ఇల్యూషన్స్ అంటారు. ఫోటో పజిల్స్ కూడా అలాంటివే. ఫోటో పజిల్స్ మీ కళ్లలో ఎంత పవర్ ఉందో కూడా చెప్పేస్తాయ్. ఈ ఫోటో పజిల్స్ అందించేందుకు కొన్ని సోషల్ మీడియా పేజీలు కూడా ఉన్నాయి. ఇలాంటి పజిల్స్ కొన్ని ఈజీగా ఉన్నా, మరికొన్ని మాత్రం సరదా తీర్చేస్తాయి. తెగ తికమక పెడుతూ మనకి సవాల్ విసురుతాయి. వీడని చిక్కుముడిలా ఉండి మన కళ్లను మోసం చేస్తుంటాయి. ఈ మధ్య కాలంలో జనాలను బాగా ఆకట్టుకుంటున్న చిత్రాలివి. తాజా అలాంటిదే ఓ ఫోటో వైరల్ అవుతోంది. దాని కథ ఏంటో తెలుసుకుందా పదండి. ఏదైనా కళ్ళతో పసిగడతాం అనుకుంటే.. మా ఐ పవర్ చాలా ఎక్కువ అనేకునేవారు ఈ ఛాలెంజ్ యాక్టెప్ట్ చేయండి.
మీరు పైన చూస్తోన్న ఫోటోలో ఓ పక్షి దాగుంది. ఆ చెట్టు ఆకుల రంగులో ఉండటం వల్ల దాన్ని కనిపెట్టడం చాలా కష్టం నూటికి 90 శాతం మంది ఈ పజిల్ సాల్వ్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఫోటోలోని పక్షి కొద్ది సమయంలోనే కనిపెట్టారంటే మీ చూపుల్లో క్వాలిటీ ఎక్కువ ఉంది అని ఒప్పుకోవాలి. అబ్బా.. కష్టం మా వల్ల కాదు అనిపిసతే మాత్రం సమాధానం కోసం కింద ఫోటోను చూడండి.