Optical Illusion: ఈ ఫొటోలో ఉన్న టైని కనిపెట్టారంటే.. మీరు తోపే!

|

May 15, 2024 | 9:25 PM

ఆప్టికల్ ఇల్యూషన్స్‌.. ప్రస్తుతం ఎక్కడ చూసినా వీటి ముచ్చటే. సోషల్ మీడియాలో సైతం ఆప్టికల్స్ ఇల్యూషన్స్ అనేవి జోరుగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఇవి వీర లెవల్లో ట్రెండింగ్ అవుతున్నాయి. వీటిని ఆడేందుకు కూడా చాలా మంది ఆసక్తి కూడా చూపిస్తున్నారు. ఆప్టికల్స్ ఇల్యూషన్స్‌లో చాలా రకాలు ఉంటాయి. నెంబర్స్, పజిల్స్, లెటర్స్, ఫోటోస్ ఇలా చాలా రకాలు ఉన్నాయి. ఆప్టికల్ ఇల్యూషన్స్ ఇంతకు ముందు కేవలం..

Optical Illusion: ఈ ఫొటోలో ఉన్న టైని కనిపెట్టారంటే.. మీరు తోపే!
Optical Illusion
Follow us on

ఆప్టికల్ ఇల్యూషన్స్‌.. ప్రస్తుతం ఎక్కడ చూసినా వీటి ముచ్చటే. సోషల్ మీడియాలో సైతం ఆప్టికల్స్ ఇల్యూషన్స్ అనేవి జోరుగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఇవి వీర లెవల్లో ట్రెండింగ్ అవుతున్నాయి. వీటిని ఆడేందుకు కూడా చాలా మంది ఆసక్తి కూడా చూపిస్తున్నారు. ఆప్టికల్స్ ఇల్యూషన్స్‌లో చాలా రకాలు ఉంటాయి. నెంబర్స్, పజిల్స్, లెటర్స్, ఫోటోస్ ఇలా చాలా రకాలు ఉన్నాయి. ఆప్టికల్ ఇల్యూషన్స్ ఇంతకు ముందు కేవలం వీక్లీ పేపర్స్‌లో మాత్రమే వచ్చేవి. కానీ ఇప్పుడు షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్, హోటల్స్ లలో కూడా వీటిని టైమ్‌ పాస్ అవ్వడానికి ఇస్తున్నారు.

అయితే వీటిని కేవలం టైమ్ పాస్ అవ్వడానికి మాతమ్రే ఆడుతున్నారు అనుకుంటే పొరపాటే. ఈ ఆప్టికల్ ఇల్యూషన్స్ ఆడటం వల్ల మీ ఐక్యూ లెవల్స్ అనేవి పెరుగుతాయి. అంతే కాకుండా మీ కంటికి, మెదడుకు మధ్య సమన్వయం కూడా పెరుగుతుంది. పిల్లల చేత వీటిని తరచూ ఆడిస్తే.. వారి బ్రెయిన్ షార్ప్ అవుతుంది. వీటిని ఆడటం వల్ల ఒత్తిడి, ఆందోళన వంటివి కూడా తగ్గుతాయి. వీటి వలన బెనిఫిట్సే తప్ప నష్టాలు లేనే లేవు. ఈ ఆప్టికల్ ఇల్యూషన్స్‌కి ఈ మధ్య డిమాండ్ అనేది బాగా పెరిగింది. వీటికి ఫ్యాన్స్ కూడా చాలా మంది ఉన్నారు.

తాజాగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ఆప్టికల్‌ ఇల్యూషన్‌తో మీ ముందుకు వచ్చేశాం. ఇప్పుడు మీరు ఈ ఫొటో చూశారంటే.. పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. ఇది కాస్త ఆడటం కష్టతరంగానే ఉన్నా.. మెదడుకు మాత్రం ఆలోచనా శక్తి పెరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్‌లో మెడకు కట్టుకునే టై ఒకటి ఉంది. అదెక్కడ ఉందో మీరే కనిపెట్టాలి. ఇక్కడ చెట్లు, పూలు, ముక్కలు, చెంచీలు ఉన్నాయి. వీటి మధ్యలోనే ఆ టై అనేది ఉంది. ఇదే మీకు క్లూ.. కనిపెట్టండి.

ఇవి కూడా చదవండి

జవాబు ఇదే:

ఇప్పుడు ఈ ఆప్టికల్‌ ఇల్యూషన్‌లోని జవాబు కనిపెట్టిన వారికి కంగ్రాట్స్. ఇంకా కనిపెట్టలేని వారికి మాత్రం ఈ సమాధానం. ఇది కనిపెట్టడానికి కాస్త ఆలోచనా శక్తి కావాలి. ఈజీగానే ఉన్నా.. కనిపెట్టడం మాత్రం కాస్త కష్టం. చిత్రంలో ఒక మూల కొబ్బరి చెట్లు ఉన్నాయి. అందులో మొదటి కొబ్బరి చెట్టు ఆకారాన్ని గమనించండి. అచ్చం టైలానే ఉంది కదా.. అదే ఆన్సర్.