Viral Video: సింహాలు, మొసలి మధ్య భీకర యుద్ధం.. చివరిలో షాకింగ్ ట్విస్ట్.. ఏం జరిగిందంటే.!

అడవిలో చట్టాలు, నిబంధనలు భిన్నంగా ఉంటాయి. కొన్ని జంతువులు అడవిని శాసిస్తే.. మరికొన్ని నీటిని శాసిస్తాయి. ఇక అడవిలోని ఇద్దరు రాజులు ఒకేసారి...

Viral Video: సింహాలు, మొసలి మధ్య భీకర యుద్ధం.. చివరిలో షాకింగ్ ట్విస్ట్.. ఏం జరిగిందంటే.!
Crocodile And Lions

Updated on: Mar 31, 2021 | 3:37 PM

Lion Viral Video: అడవిలో చట్టాలు, నిబంధనలు భిన్నంగా ఉంటాయి. కొన్ని జంతువులు అడవిని శాసిస్తే.. మరికొన్ని నీటిని శాసిస్తాయి. ఇక అడవిలోని ఇద్దరు రాజులు ఒకేసారి ముఖాముఖి తలబడితే.. ఆ సీన్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందని చెప్పొచ్చు. ఇద్దరి మధ్య మంచి రసవత్తరమైన పోరు జరుగుతుంది. ఇక ఇప్పుడు అలాంటి ఓ భీకర యుద్ధానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానిని చూసిన జనం ఆశ్చర్యానికి గురవుతున్నారు.

‘అడవి రాజు’ సింహం, ‘సముద్రపు అలెగ్జాండర్’ మొసలి ఒకేసారి ఫైట్‌కు దిగాయి. అయితే అది ఒకటి కాదు ఏకంగా ఐదు సింహాలు ఒకేసారి మొసలిపై దాడి చేశాయి. ఏదేమైనా, మొసలి కూడా సింహాలన్నింటినీ చాకచక్యంగా మోసగించింది. జంతువులు ఒకరినొకరు ఎదుర్కొన్నప్పుడు, ఆ దృశ్యం చాలా భయానకంగా ఉంటుంది. అదే విషయాన్ని మీరూ ఈ వీడియోలో చూడవచ్చు. నది ఒడ్డున ఒక మొసలి విశ్రాంతి తీసుకుంటే… ఎక్కడి నుంచో ఐదు సింహాలు ఒక్కసారిగా దాడికి దిగుతాయి. ఇక మొసలి కూడా వాటిపై ఎదురుదాడి చేస్తుంది. కొద్దిసేపు రెండింటి మధ్య తీవ్రమైన యుద్ధం జరుగుతుంది. అయితే అనూహ్యంగా తెలివితో మొసలి వెంటనే నీటి అడుగుకు వెళ్ళిపోతుంది. కాగా, ఈ వీడియోను ‘లైఫ్ అండ్ నేచర్’ ట్విట్టర్‌లో షేర్ చేయగా.. కొంత వ్యవధిలోనే అది కాస్తా వైరల్‌గా మారింది. దీనిని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. రీ-ట్వీట్లు, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

Also Read:

చనిపోయినట్లుగా ‘ముంగూస్’ చిలిపి డ్రామాలు.. వైరల్ వీడియో.. చివరికి అదిరిపోయే ట్విస్ట్ .!

తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు అలెర్ట్.. పలు రైళ్ల సమయాల్లో మార్పులు.. వివరాలు ఇవే.!

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌కు కరోనా పాజిటివ్.. ట్విట్టర్ వేదికగా ప్రకటన.!

Follow Us