వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రివేళ ప్రియుడు గప్‌చుప్‌గా ప్రేయసి ఇంటికెళ్ళాడు. ఆ తర్వాత ఆమెను మేడపైకి తీసుకెళ్లాడు. అనంతరం భారీ శబ్దాలు వినిపించడంతో ఒక్కసారిగా స్థానికులు ఉలిక్కిపడ్డారు. సీన్ కట్ చేస్తే..
వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌కు చెందిన కాజల్ కుమారి, గోపాల్ కుమార్ ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఇరుగుపొరుగు ఉండే వీరిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం.. కొద్దిరోజులకు ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి సమయంలో గోపాల్.. గప్‌చుప్‌గా కాజల్ ఇంటికెళ్ళాడు. అనంతరం ఏకాంతంగా మాట్లాడేందుకు యువతిని మేడపైకి తీసుకెళ్లాడు. అయితే వీరిద్దరి మధ్య ఏదో విషయమై పెద్ద వివాదం తలెత్తింది.
దీనితో పట్టలేనంత కోపొద్రిక్తుడైన గోపాల్.. తన వెంట తెచ్చుకున్న తుపాకీతో కాజల్‌ను కాల్చేశాడు. అంతేకాదు తనకు తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వరుసగా పేలుడు శబ్దాలు రావడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే స్పాట్‌కు చేరుకొని రక్తం మడుగులో ఉన్న ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అసలు ఆ యువకుడి వద్ద తుపాకీ ఎందుకుంది.? ఏ విషయంపై గొడవపడ్డారు.? అనే విషయాలపై విచారణ చేపట్టారు.