మనిషైనా, సింహమైనా.. భార్యకు భయపడాల్సిందే.. ఈ వీడియో చూస్తే మీరూ అదే అంటారు.!

జంతువులన్నీ కూడా అడవిలో ప్రతీ రోజూ జీవనమరణ పోరాటాన్ని సాగిస్తుంటాయి. క్రూర జంతువులకు దొరకకుండా చిన్న జంతువులు తప్పించుకుంటే.. వేటాడే సింహం, పులి, చిరుత, మొసలి నుంచి మరికొన్ని తప్పించుకుంటాయి. ఇదిలా ఉంటే.. అడవికి రారాజు సింహం.. దాని ఒక్క గర్జన చాలు..

మనిషైనా, సింహమైనా.. భార్యకు భయపడాల్సిందే.. ఈ వీడియో చూస్తే మీరూ అదే అంటారు.!
Lion Attack

Updated on: Apr 13, 2024 | 8:44 PM

జంతువులన్నీ కూడా అడవిలో ప్రతీ రోజూ జీవనమరణ పోరాటాన్ని సాగిస్తుంటాయి. క్రూర జంతువులకు దొరకకుండా చిన్న జంతువులు తప్పించుకుంటే.. వేటాడే సింహం, పులి, చిరుత, మొసలి నుంచి మరికొన్ని తప్పించుకుంటాయి. ఇదిలా ఉంటే.. అడవికి రారాజు సింహం.. దాని ఒక్క గర్జన చాలు.. మిగతా జంతువులు అన్ని కూడా దెబ్బకు భయపడి.. దడుసుకుంటాయి. అలాంటిది రారాజైన సింహం కూడా ఒకరిని చూస్తే భయపడిపోతుంది. మరి అదే ఎవరో కాదు ఆడ సింహం అండీ బాబూ..

వైరల్ వీడియో ప్రకారం.. రోడ్డుకు ఆనుకుని ఉన్న గొయ్యిలో అప్పటికే ఆడ సింహం ఎంచక్కా సేద తీరుతోంది. ఇక అప్పుడే వచ్చిన మగ సింహం.. అంతే.! ఇంకేముంది.. ఆ ఆడ సింహం.. గయ్యిమంటూ లేచి మగ సింహంపై శివాలెత్తింది. దానిపైకి దూకుతూ.. పరుగులు పెట్టించింది. తన పిల్లలకు ప్రమాదం వాటిల్లకుండా ఆడ సింహాలు అప్పుడప్పుడూ మగ సింహలతో గొడవపడతాయని అంటున్నారు. కాగా, ఈ వీడియో క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘అమేజింగ్ నేచర్’ అనే ట్విట్టర్ ఖాతా దీనిని ఇంటర్నెట్‌లో షేర్ చేయగా.. ఈ వీడియోపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తించారు. ‘భార్యతో వాదిస్తే.. ఇలాగే ఉంటుంది’ అని ఒకరు కామెంట్ చేస్తే.. ‘మనుషులకు కూడా ఇదే పరిస్థితి అని’ మరొకరు కామెంట్ చేశారు. మీరూ వీడియోపై ఓ లుక్కేయండి మరి..