అధిపత్య పోరు సర్వసాధారణమైన విషయం. మనుషులు విజయం, అస్తిత్వం కోసం ఈ పోరు చేస్తే జంతువులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి చేస్తుంటాయి. ఈ పోరు నుంచి తప్పుకుంటే ప్రాణాలు కోల్పోక తప్పదు. అడవి ఇలాంటి ఎన్నో పోరాటలకు సాక్ష్యంగా నిలుస్తుంటుంది. ప్రపంచానికి కనిపించని ఎన్నో పోరాటాలకు వేదికవుతుంటుంది. ఇలాంటి అరుదైన సన్నివేశాలను చూడడానికే సఫారీలు నిర్వహిస్తుంటారు.
నేషనల్ పార్క్స్‌లో జంతువులను చూపించేందుకు సఫారీ కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. ఈ అడ్వెంచర్‌ను ఎంజాయ్ చేసే యాత్రికులు అక్కడ కనిపించిన దృశ్యాలను కెమెరాల్లో బంధిస్తుంటారు. అయితే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సఫారీకి సంబంధించిన ఇలాంటి వీడియాలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియోనే నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
ఓ అటవీ ప్రాంతంలో పులి, ఎలుగు బంటి ఎదురెదురా తారసపడ్డాయి. అదే సమయంలో పులి ఎలుగుబంటిపై ఒక్కసారిగా దాడికి ప్రయత్నించింది. సహజంగా అయితే పులి దాడికి ఎలుగు బంటి పరార్ అవుతుందని అంతా భావిస్తాం. కానీ ఇక్కడ పూర్తిగా రివర్స్‌గా జరిగింది. ఎలుగుబంటి ధీటుగా దాడికి దిగడంతో పులి అక్కడి నుంచి తొక ముడుచుకొని పారిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..