తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల చాలా శ్రద్ధ తీసుకుంటారు. అనుక్షణం రక్షణగా ఉంటూ ఏ కష్టం రాకుండా చూసుకుంటారు. వారికి హాని కలిగితే విలవిల్లాడిపోతారు. పిల్లలు, తల్లిదండ్రులకు మధ్య ఉన్న అనుబధం మనకు తెలిసిందే. అయితే అమ్మాయిలకు తమ తండ్రులతో ఎక్కువ అనుబంధం ఉంటుందనేది వాస్తవం. కాగా ప్రస్తుతం సోషల్ మీడియాలో (social media) ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ క్లిప్ లో ఓ చిన్నారి సైకిల్ పై వేగంగా వస్తోంది. ఆమె తన ఎదురుగా ఉన్న ప్రమాదాన్ని గమనించక అలాగే సైకిల్ తొక్కుతోంది. వెంటనే అప్రమత్తమైన ఆమె తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్లి చిన్నారిని కాపాడతాడు. వైరల్ అవుతున్న ఈ వీడియో (Video) లో.. కొందరు వ్యక్తులు రోడ్డు పక్కన ఫుట్ పాత్ పై నిల్చుని ఉన్నారు. ఓ బాలిక సైకిల్ పై వేగంగా వస్తూ రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తుంది. అప్పుడే రోడ్డుకు అవతలవైపు ఉన్న ఇనుప స్తంభాన్ని ఢీకొట్టబోతుండగా.. వెంటనే ఆమె తండ్రి చిన్నారిని సురక్షితంగా కాపాడతాడు. బాలికను పట్టుకోకపోయుంటే ఆమె తీవ్రమైన ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉండేదన్న విషయం మనకు అర్థమవుతోంది.
ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయింది. దీనికి సూపర్‌డాడ్ అనే క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో అంతకంతకూ వైరల్ అవుతోంది. అతను చిన్నారిని కాపాడిన తీరు అభినందనీయమని అంటున్నారు. అతని అప్రమత్తత కారణంగా స్తంభానికి ఢీకొనకుండా బాలిక సురక్షితంగా బయటపడిందని కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి