Viral Video: ఇంట్లోని LED టీవీ లోపల నుంచి అదే పనిగా శబ్దాలు.. ఏంటా అని విప్పతీసి చూడగా

LED టీవీ లోపల నుంచి శబ్దాలు వస్తున్నాయి. అది కూడా అదే పనిగా.. బల్లి ఏమైనా దూరందేమో అని చూడగా.. షాక్ తిన్నారు. ఎందుకంటే లోపల ఓ పాము మెలికలు తిరుగుతూ కనిపించింది. దీంతో వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారమిచ్చారు ..

Viral Video: ఇంట్లోని LED టీవీ లోపల నుంచి అదే పనిగా శబ్దాలు.. ఏంటా అని విప్పతీసి చూడగా
Snake Inside TV

Updated on: Sep 07, 2025 | 5:19 PM

పాములు అంటే ఎవరికి భయం ఉండదు చెప్పండి ? కొంతమంది అయితే పాము అన్న పేరు వింటేనే పరుగులు తీస్తారు. అలాంటి పాములు రోజూ మనం నివశించే ఇంట్లోకి ఎంట్రీ ఇస్తే ఏమైనా ఉంటుందా..?. ప్రస్తుతం రెయినీ సీజన్ కావడంతో పాము ఇళ్లలోకి ప్రవేశించి పలు ప్రాంతాల్లో నక్కి ఉంటున్నాయి. ఈ క్రమంలో పాముకాటు కేసులు కూడా తరచుగా వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఓ పాము ఏకంగా LED టీవీ లోపల నక్కి ఉండటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. సమాచారంతో రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్.. టీవీని విప్పతీసి చాకచక్యంగా పామును రెస్క్యూ చేశాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నాగేంద్ర అనే ఫేస్‌బుక్ ఖాతాలో షేర్ చేసిన వీడియోలో, LED టీవీ లోపలికి దూరిన పామును రెస్క్యూ చేయడం మీరు చూడవచ్చు. ఆ కుటుంబం టీవీ లోపల నుంచి శబ్దాలు రావడంతో.. అతడిని రప్పించింది. అక్కడికి వచ్చిన స్నేక్ క్యాచర్ టీవీ పార్ట్స్ విడదీసి పామును రక్షించాడు. బుహుశా బల్లులు లేదా పురుగులను తినేందుకు అది ఇంట్లోకి ప్రవేశించి ఉండవచ్చని అతను చెప్పాడు. ఈ ఘటన కర్నాటకలో జరిగింది.

ఈ వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. టీవీలో పాము దూరడం ఫస్ట్ టైం చూస్తున్నామని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. బోర్ కొట్టి ఉంటది.. అందుకు టీవీ చూడటానికి వచ్చిందని మరొకరు సరదాగా వ్యాఖ్యానించారు.