Viral Video: ఏంటక్కా.. మరీ ఇలానా..? సూటు బూటు వేసి రైలెక్కింది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

|

Aug 26, 2024 | 5:55 PM

వైట్ షర్ట్.. బ్లాక్ పాయింట్ ధరించింది.. పైన పింక్ కలర్ కోట్.. మెడలో ఓ ఐడీ కార్డు.. ఓరీని.. ఆమెను చూస్తే అచ్చం ఓ ఆఫీసర్ మాదిరిగానే ఉంది.. ఇంకేముంది.. రైలెక్కి.. టికెట్ చూపించండి.. టికెట్.. టికెట్ అంటూ ప్రయాణికుల దగ్గరకు వెళ్లింది.. ఇంతలోనే ఓ ప్రయాణికుడికి అనుమానమొచ్చి.. ఐడీ నెంబర్ చెప్పమనగానే..

Viral Video: ఏంటక్కా.. మరీ ఇలానా..? సూటు బూటు వేసి రైలెక్కింది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Fake Woman TTE Viral Video
Follow us on

వైట్ షర్ట్.. బ్లాక్ పాయింట్ ధరించింది.. పైన పింక్ కలర్ కోట్.. మెడలో ఓ ఐడీ కార్డు.. ఓరీని.. ఆమెను చూస్తే అచ్చం ఓ ఆఫీసర్ మాదిరిగానే ఉంది.. ఇంకేముంది.. రైలెక్కి.. టికెట్ చూపించండి.. టికెట్.. టికెట్ అంటూ ప్రయాణికుల దగ్గరకు వెళ్లింది.. ఇంతలోనే ఓ ప్రయాణికుడికి అనుమానమొచ్చి.. ఐడీ నెంబర్ చెప్పమనగానే.. అసలు విషయం బయటపడింది.. రైలులో ప్రయాణీకులను మోసం చేసేందుకు ఓ నకిలీ మహిళ టీటీఈ ఎలా ప్రయత్నించిందో చూపించే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.. అయితే, ఆ తర్వాత రైల్వే పోలీసులు ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీలో చోటుచేసుకుంది..

వైరల్ వీడియో ప్రారంభం కాగానే.. ఒక మహిళా TTE కదులుతున్న రైలులో ప్రయాణీకుల టిక్కెట్లను తనిఖీ చేస్తోంది. కొంతమంది ప్రయాణీకులు ఆమె కదలికలను అనుమానాస్పదంగా గుర్తించారు.. ఈ క్రమంలోనే.. ఆమెను ID ప్రూఫ్ అడిగారు. ప్రయాణికులు చుట్టుముట్టడంతో టీటీఈగా చెప్పుకున్న మహిళ ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయింది.

వీడియో చూడండి..

ఒక వ్యక్తి ఆమె ID కార్డ్.. జాబ్ నంబర్‌ను అడిగాడు.. మహిళా TTE తనకు తెలియదని బదులిచ్చింది.. కొన్ని తనిఖీలు జరుగుతున్నాయని ఆమె చెప్పింది. అనంతరం ప్రయాణికులు ఆమెను నకిలీ టీటీఈగా గుర్తించి తదుపరి స్టేషన్‌లోని రైల్వే పోలీసులకు అప్పగించారు. నకిలీ టీటీఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, నెటిజన్లు కూడా ఫేక్ టీటీఈ వీడియోపై చమత్కారమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.

నకిలీ టీటీఈ పట్టుకున్న ఘటన పాతాల్‌కోట్ ఎక్స్‌ప్రెస్ లో చోటుచేసుకుంది. రైలు నంబర్ 14624, AC కోచ్ నం. A-1 నుంచి మహిళను దబ్రా స్టేషన్‌లో దింపారు.. అనంతరం ఆమెను ఆర్‌పిఎఫ్‌కు అప్పగించారు. పోలీసులు ఆమెను కొన్ని గంటల పాటు కస్టడీలోకి తీసుకున్నప్పటికీ ఫిర్యాదు నమోదు కాలేదనే కారణంతో ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..