Photo Puzzle: ఈ ఫోటోలో పాము ఎక్కడుందో కనిపెట్టగలరా జారుమిఠాయా.. మీ ఐ ఫోకస్ ఇట్టే తెలిసిపోతుంది

|

Dec 05, 2022 | 12:33 PM

ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో కనిపించే వివిధ రకాల పజిల్స్‌‌ను సాల్వ్ చేసేందుకు చాలామంది ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. వాటిలో ఫోటో పజిల్స్ ఎక్కువగా ఉన్నాయి. మీ కోసం ఇప్పుడు క్రేజీ ఫోటో పజిల్...

Photo Puzzle: ఈ ఫోటోలో పాము ఎక్కడుందో కనిపెట్టగలరా జారుమిఠాయా.. మీ ఐ ఫోకస్ ఇట్టే తెలిసిపోతుంది
Find The Snake Puzzle
Follow us on

పజిల్ మామ పజిల్. మాయ చేసే పజిల్.. మీ కళ్లను మోసం చేసే పజిల్. మీకు బోలెడంత కిక్కిచ్చే పజిల్. ఫన్ మాత్రమే కాదు.. అందుకు మించి పదును కూడా. అవును ఇలాంటి పజిల్స్ మీ బుర్రను కాస్తంత యాక్టివ్ చేస్తాయి. మీ ఐ ఫోకస్ ఏ లెవల్‌లో ఉందో తెలుసుకునేందుకు ఉపయోగపడతాయ్. సవాళ్లు స్వీకరించే గుణం ఉన్నవాళ్లు.. ఎలాంటి టఫ్ పని అయినా చేసే ధైర్యం ఉన్నవారు సొసైటీలో చాలా అరుదైగా ఉంటారు. వారు ఎలాంటి సందర్భం ఎదురైనా తెలివితోనో, తెగువతోనే తేల్చుకుంటారు తప్ప.. వెన్ను చూపి పారిపోరు. అలాంటి స్వభావం ఉన్నవాళ్లు ఇలాంటి పజిల్స్ బాగా ఇష్టపడతారు. అదిగో ఆ టైప్ పీపుల్ కోసం ఈ ఖతర్నాక్ పజిల్.

ఇచ్చిన ఫోటోలో ఓ మైదాన ప్రాంతం కనిపిస్తుంది. ఇక్కడే ఓ పాము సైతం నక్కి ఉంది. మీరు అది ఎక్కడుందో పసిగట్టాలి. కొంచెం కష్టమైన టాస్కే. చాలామంది పామును కనిపెట్టలేక చేతులెత్తేస్తున్నారు. బాబోయ్ మా వల్ల కావడం లేదంటూ నిట్టూర్పులు విడుస్తున్నారు. రీజన్ ఏంటంటే.. అక్కడ ఉన్న పచ్చిక రంగులో ఆ పాము ఇమిడిపోయింది. అందుకే దాన్ని గుర్తించడం కష్టతరంగా మారింది. చిన్న క్లూ ఏంటంటే మీరు ఫోటో కుడివైపు కాస్త ఫోకస్ పెట్టి చూడండి.

ఏంటి కనిపెట్టేశారా..? అదే జరిగితే మీ ఐ పవర్ అద్భుతం అంతే. దాన్ని కనుగొనలేకపోయారా..? పర్లేదు ప్రయత్నాలు కొన్నిసార్లు విజయాల కంటే గొప్పవి. ఇక ఆన్సర్ ఉన్న ఫోటోని దిగువన ఇస్తున్నాం చూడండి. ఇక ఇలాంటి పజిల్స్ మరిన్ని కావాలంటే టీవీ9 వెబ్‌సైట్ ట్రెండింగ్ పేజీపై ఓ లుక్కేయండి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..