Pune Techie: ఇలాంటివాళ్లూ ఉంటారా? రూ. 47 లక్షల జాబ్ రిజెక్ట్ చేసిన టెక్కీ.. అసలు కారణం తెలిస్తే షాకవుతారు!

పూణేకు చెందిన వనేష్ మాలి అనే ఇంజినీరింగ్ మేనేజర్ తనకు వచ్చిన రూ.47 లక్షల (47 LPA) వార్షిక ప్యాకేజీని తిరస్కరించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ప్యాకేజీ అద్భుతంగా ఉన్నా, కంపెనీ ప్రతిష్టాత్మకమైనదైనా ఆయన నో చెప్పడానికి గల కారణం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. కొందరు ఆయన నిజాయితీని, ఆత్మవిశ్వాసాన్ని మెచ్చుకుంటుంటే.. మరికొందరు మాత్రం

Pune Techie: ఇలాంటివాళ్లూ ఉంటారా? రూ. 47 లక్షల జాబ్ రిజెక్ట్ చేసిన టెక్కీ.. అసలు కారణం తెలిస్తే షాకవుతారు!
Engineer Rejects Offer

Updated on: Mar 22, 2026 | 4:00 PM

నేటి కాలంలో సాఫ్ట్‌వేర్ రంగంలో భారీ ప్యాకేజీ సాధించడం అనేది ఒక కల. అలాంటిది ఏకంగా రూ.47 లక్షల ఆఫర్ చేతికి అందితే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ, పూణేకు చెందిన వనేష్ మాలి అనే టెక్కీ మాత్రం ఆ ఆఫర్‌ను తిరస్కరించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు టెక్ ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీసింది. వనేష్ మాలి ఒక ఇంజినీరింగ్ మేనేజర్. ఆయనకు ఒక ప్రముఖ కంపెనీ నుండి సీనియర్ పోస్ట్ కోసం రూ.47 LPA ఆఫర్ వచ్చింది. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినప్పటికీ, ఆ రోల్ కి కావాల్సిన కొన్ని టెక్నికల్ స్కిల్స్ లో తనకు పట్టు లేదని ఆయన గుర్తించారు. కేవలం జీతం కోసం ఉద్యోగంలో చేరి, తర్వాత అక్కడ రాణించలేకపోతే అది రిస్క్ అవుతుంది. కంపెనీ మనపై భారీగా పెట్టుబడి పెట్టినప్పుడు దానికి తగ్గ ప్రతిఫలం ఇవ్వడం మన బాధ్యత అని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

కంపెనీ, ప్యాకేజీ రెండూ చాలా బాగున్నాయి. కానీ, ఆ స్థాయి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడానికి నేను ఇంకా సిద్ధంగా లేను అని ఆయన తన ఎక్స్ (X) పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇంత పెద్ద మొత్తంలో జీతం ఇచ్చేటప్పుడు మేనేజ్‌మెంట్ నుంచి అంచనాలు చాలా ఎక్కువగా ఉంటాయని, ఒకవేళ ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వలేకపోతే అది తన కెరీర్‌కే కాకుండా సంస్థకు కూడా ఇబ్బందికరంగా మారుతుందని ఆయన వివరించారు. ఆయన పెట్టిన పోస్ట్ వైరల్ అవ్వడంతో సోషల్ మీడియా రెండు వర్గాలుగా విడిపోయింది. ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. కొందరు ఆయన నిజాయితీని, ఆత్మవిశ్వాసాన్ని మెచ్చుకుంటుంటే.. మరికొందరు మాత్రం ఉద్యోగంలో చేరాక కూడా కొత్త విషయాలు నేర్చుకోవచ్చని, ఇలాంటి మంచి అవకాశాన్ని వదులుకోవడం తప్పని అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

నెటిజన్లలో ప్రశంసించేవారు డబ్బు కంటే విలువలకు, పనికి ప్రాధాన్యత ఇవ్వడం గొప్ప విషయం అంటున్నారు.. మీ సెల్ఫ్-అవేర్‌నెస్ (Self-awareness) మీకు భవిష్యత్తులో మరిన్ని గొప్ప అవకాశాలు తెచ్చిపెడుతుంది అని చాలా మంది ఆయనను అభినందిస్తున్నారు. ఇక అదే స్థాయిలో విమర్శించేవారు కూడా ఉన్నారు. ఏ ఉద్యోగంలోనైనా చేరిన తర్వాతే నేర్చుకుంటాం. 100శాతం స్కిల్స్ ఎవరికీ ఉండవు. వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం సరైన నిర్ణయం కాదు అంటూ చాలా మంది హితవు పలుకుతున్నారు.

వనేష్ మాలి నిర్ణయం మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తుంది. కెరీర్ ఎదుగుదలలో కేవలం అంకెలు మాత్రమే కాదు, మనం చేసే పనిపై మనకు ఉండే నమ్మకం కూడా ముఖ్యమే. ప్రస్తుతం ఆయన తన స్కిల్స్ మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టారు. త్వరలోనే తను కోరుకున్న స్థాయిలో, పూర్తి ఆత్మవిశ్వాసంతో కొత్త బాధ్యతలు చేపట్టాలని ఆశిద్దాం.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us