సైకిల్, బైక్, ఆటోలు, కార్లు, బస్సులు ఇలా మనం వినియోగించే అన్ని వాహనాల టైర్లు గుండ్రంగానే ఉంటాయి. టైర్లు గుండ్రంగా ఉంటేనే వాహనాలు సులువుగా ముందుకు వెళ్లగలుగుతాయి. అయితేనేం కాలం మారుతున్న కొద్ది కొత్త కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తూనే ఉంటాయి. ఇప్పుడు సైకిల్ టైర్లపై చేసిన ఓ ఆవిష్కరణ అందర్ని ఆశ్చర్యపరుస్తోంది. టైర్లు గుండ్రంగా కాకుండా చతురస్రాకారంలోఉన్న సరికొత్త సైకిల్‌ను తయారు చేశారు. చతురస్రాకంలో ఉంటే సైకిల్ ఎలా ముందుకెళ్తుందబ్బ అని అనుకుంటున్నారా.. అయితే ఇక్కడ సైకిల్ చక్రాలు కదలకుండా వాటిపై ఏర్పాటు చేసిన రబ్బర్ రౌండ్‌గా తిరుగుతుంది.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియోను 19 మిలియన్ల మంది వీక్షించారు. 40 వేల లైక్స్ వచ్చాయి. ఈ సైకిల్ పై నెటిజన్లు భిన్నమైన రీతిలో తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సైకిల్ ఎక్కడ దొరుకుతుందని ఒకరు..ఎప్పుడు మార్కెట్‌లోకి వస్తుందని మరొకలు ఇలా కామెంట్స్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వింతగా ఉన్న ఆ సైకిల్ వీడియోను చూసేయండి.
How The Q created a bike with fully working square wheels (capable of making turns)
[full video: https://t.co/wWdmmzRQY3]pic.twitter.com/bTIWpYvbG1
— Massimo (@Rainmaker1973) April 11, 2023
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..