Viral Video: ఇండిగో ఎయిర్ హోస్టెస్ వీడియోకు ఫిదా అయిన నెటిజన్లు..! లక్షల మంది మనసులను దోచేసింది..!

ఇండిగో ఎయిర్ హోస్టెస్ పర్మిటా రాయ్ తన తల్లిదండ్రులకు జీవితంలో మర్చిపోలేని అనుభూతిని పంచింది. ఆమె విధులు నిర్వహిస్తున్న విమానంలోనే తల్లిదండ్రులు ప్రయాణించడం విశేషం. ఈ అరుదైన క్షణాలను పర్మిటా వీడియో తీసి నా కలలు నెరవేర్చిన ప్రయాణం అంటూ భావోద్వేగానికి లోనైంది.

Viral Video: ఇండిగో ఎయిర్ హోస్టెస్ వీడియోకు ఫిదా అయిన నెటిజన్లు..! లక్షల మంది మనసులను దోచేసింది..!
Emotional Flight Scene

Updated on: Jun 24, 2025 | 12:47 PM

పర్మిటా తన తల్లిని ఎంతో ఆప్యాయంగా పలకరించింది. తల్లి ముఖంలో ఆశ్చర్యం, ఆనందం కలగలిసిన భావాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఆమె తన తల్లిదండ్రుల పాదాలను తాకి ఆశీర్వాదాలు తీసుకుంది. టికెట్లను పరిశీలించి వారి సీట్ల వద్దకు తీసుకువెళ్లింది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. పర్మిటా చూపిన వినయం, తల్లిదండ్రుల పట్ల ఆమెకున్న గౌరవాన్ని నెటిజన్లు తెగ ప్రశంసిస్తున్నారు. పెద్దల పట్ల గౌరవం చూపడం నిజమైన గర్వకారణం అని ఒకరు వ్యాఖ్యానించగా.. మరొకరు మీరు తల్లిదండ్రుల పాదాలను తాకారు.. అదే సమయంలో లక్షలాది మంది మనసులను తాకారు. మీరు ఆకాశంలో ఎగురుతున్నా.. నేలపై మీ వినయం నిలిచిపోతుంది అని పేర్కొన్నారు.

ఇలాంటి ఘటనలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో స్పైస్‌ జెట్‌ కు చెందిన మరో ఎయిర్ హోస్టెస్ కూడా తన తల్లిదండ్రుల టిక్కెట్లను తనిఖీ చేసి సీట్ల వద్దకు తీసుకెళ్ళిన వీడియో సోషల్ మీడియాలో బాగా ఆదరణ పొందింది. తల్లిదండ్రుల ముఖంలో కనిపించిన గర్వభావం అందరినీ ఆకట్టుకుంది.