Viral News: ఏదైనా దేశానికి స్వాతంత్య్ర దినోత్సవం లేదా.. ముఖ్యమైన వేడుకల సమయంలో ఇతర దేశాలు శుభాకాంక్షలు తెలియజేయడం సర్వసాధారణం. ఆ దేశానికి, భారత్ కు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకోవడం, భారత నాయకత్వాన్ని అభినందించడం సాధారణంగా చూస్తుంటాం.. కాని భారత్ లోని జపాన్ రాయబార కార్యాలయం అధికారులు, సిబ్బంది వినూత్నంగా ఆలోచించి.. ఓ వీడియో రూపంలో స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇంతకీ ఈవీడియోలో ఏముందనుకుంటున్నారా..
భారత్ లోని జపాన్ రాయబార కార్యాలయంలో సిబ్బంది జనగనమణ పాడుతూ.. ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. భారత్, జపాన్ కు చెందిన ఇరు దేశాల వాళ్లు.. సంగీత వాయిద్యాలతో సంగీతం వాయిస్తుండగా.. జనగనమణ గీతాన్ని ఆలపించారు. తొలుత భారత్ లోని జపాన్ రాయబార కార్యాలయ అధికారి సందేశంతో ప్రారంభమయ్యే వీడియో.. జనగనమణ గీతాన్ని ఆలపించి.. ఆతర్వాత హ్యాపీ ఇండిపెండెంట్స్ డే అని నినదించడంతో ముగుస్తుంది. ఈవీడియో జపాన్ రాయబార కార్యాలయ సిబ్బంది అంతా భారత జాతీయ జెండాను చేతితో పట్టుకుని జనగనమణ ఆలపించడం విశేషం.
The Embassy of Japan presents a vocal & instrumental rendition of National Anthem of India on #IndependenceDay of India. Join us in this musical celebration of India completing 75 glorious years of independence! https://t.co/Xsay4fmA4l#AmritMahotsav #HarGharTiranga #IndiaAt75 pic.twitter.com/kodXHwvzqn
— Embassy of Japan in India (@JapaninIndia) August 15, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..