
సమ్మర్ వచ్చేసింది.. ఎండ తీవ్రతను తట్టుకోలేక ఒకొక్కరు రెండు, మూడు సార్లు స్నానాలు చేస్తుంటారు. కానీ కొంతమంది మాత్రం సాన్నం చేయడానికి బద్దకిస్తూ ఉంటారు. అలాంటి వారు ఈ ఏనుగును చూసి నేర్చుకోవాల్సిందే.. సాధారణంగా ఏనుగులు తమ శరీరాలపై దుమ్ము, బురద పూసుకోవడం చూస్తూ ఉంటాం. అలాగే నీటిలో ఆడుకోవడానికి ఇష్టపడుతుంటాయి. ఏనుగులు ఆరోగ్యంగా ఉండటానికి కనీసం వారానికి రెండుసార్లు స్నానం చేయాల్సి ఉంటుందట. ఇది సరైన రక్త ప్రసరణకు కూడా సహాయపడుతుంది.
తాజాగా ఓ ఏనుగు స్నానం చేస్తున్న దృశ్యాలు ట్విట్టర్‌లో వైరల్‌గా మారాయి. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా షేర్ చేశారు. ఏనుగులను కట్టివేయడాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని, అయితే వాటి తెలివితేటలు తనకు నచ్చాయని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.
ఈ వీడియోలో ఏనుగు పైప్ తో స్నానం చేయడాని మనం చూడొచ్చు. నిజానికి ఏనుగు తన తొండంతో నీటిని మీద చల్లుకుంటుంది. కానీ ఈ ఏనుగు మాత్రం ఇలా పైప్ తో స్నానం చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు 3561 మంది ఈ వీడియోను లైక్ చేసారు. 32000 మందికి పైగా చూశారు.
I don’t support keeping wild in confinement,
But support the intelligence of elephants…marvellous creatures.
Here taking a bath on his own ?? pic.twitter.com/jZvhF3OJRM— Susanta Nanda (@susantananda3) March 11, 2023