ప్రేమకు కులం, మతం, వయస్సుతో సంబంధం లేదంటారు. అవును నిజమే ప్రేమకు వయస్సు అడ్డు కాదని ఓ జంట నిరూపించారు. లేట్ వయస్సులో ప్రేమలో పడ్డారు వారు. కరోనా మహమ్మారి సమయంలో జిమ్ ఆడమ్స్, ఆడ్రీ కౌట్స్ డేటింగ్ యాప్‌లో ఆన్‌లైన్‌లో కలుసుకున్నారు. ఎనిమిది నెలల ప్రేమ తర్వాత ఈ జంట సెప్టెంబర్ 25 న వివాహం చేసుకున్నారుయ. వారి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో ఇవి కాస్త వైరలయ్యాయి. పెయింటర్, రిటైర్డ్ ప్రొఫెసర్ అయిన జిమ్ ఆడమ్స్ పెళ్లైన 38 సంవత్సరాల తర్వాత 2017 సంవత్సరంలో తన భార్యను కోల్పోయారు. కొవిడ్ సమయంలో 78 ఏళ్ల ఆడమ్స్ 50 ఏళ్లు పైబడిన వ్యక్తుల కోసం ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌లో చేరారు. అక్కడ అతను 79 ఏళ్ల రిటైర్డ్ ఇన్సూరెన్స్ బ్రోకర్ ఆడ్రీని కలిశాడు. ఆమె 33 సంవత్సరాల క్రితం భర్తతో విడిపోయింది.
“నేను సైట్లో నా మొదటి ప్రయాణంలో ఆడ్రీని చూశాను,” అని జిమ్ చెప్పాడు. “ఆమెను కనుక్కొవడానికి ఒక రోజు మాత్రమే పట్టింది. ఆ తర్వాత నాకు ఎవరు అవసరం రాలేదు. ఆడ్రీ, ఆడమ్స్ కొద్ది రోజులు ప్రేమించుకున్నారు. కరోనా కాస్త తగ్గకా వారు కలిశారు. గత ప్టెంబర్ 25న పెళ్లి చేసుకున్నారు. వారి పెళ్లి ఫొటోలను ఫోటోగ్రాఫర్ జూలీ రాండ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటో అందరిని ఆకర్షించింది. జిమ్ కుమారుడు, జెజె ఆడమ్స్ తన ట్విట్టర్‌లో వారి చిత్రాన్ని కూడా పోస్ట్ చేశారు. అది వేగంగా నెటిజన్లకు చేరి వైరల్ అయింది. పోస్ట్ అప్‌లోడ్ చేసినప్పటి నుండి 1.5 లక్షల లైక్‌లను సంపాదించింది.
My pop did the impossible – found love in the pandemic – at 77, no less! – and got hitched this weekend ❤️ pic.twitter.com/P7oehh2DT5
— J.J. Adams (@TheRealJJAdams) September 27, 2021
Read Also.. Road Accident: వేగంగా దూసుకొచ్చిన కారు.. క్షణాల వ్యవధిలో ప్రాణాలు కాపాడిన అధికారి.. వీడియో వైరల్..