Viral: సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన వింత జీవి.. రామేశ్వరం విల్లుండి తీరంలో కనిపించిన అనుకోని అతిథి

సముద్రం ఎన్నో రకాల జీవులకు ఆవాసం. కంటికి కనిపించని లార్వా నుంచి అత్యంత పెద్దమైన నీలి తిమింగలం వరకు సర్వం సముద్రంలోనే. తిమింగలాలు, డాల్ఫిన్‌, చేపలు, నీటి పాములు..

Viral: సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన వింత జీవి.. రామేశ్వరం విల్లుండి తీరంలో కనిపించిన అనుకోని అతిథి
Dogong

Updated on: Dec 19, 2022 | 5:19 PM

సముద్రం ఎన్నో రకాల జీవులకు ఆవాసం. కంటికి కనిపించని లార్వా నుంచి అత్యంత పెద్దమైన నీలి తిమింగలం వరకు సర్వం సముద్రంలోనే. తిమింగలాలు, డాల్ఫిన్‌, చేపలు, నీటి పాములు.. ఇలా చెప్పుకుంటూ పోతే అంతే ఉండదు. ఎన్నో రకాల జీవులు సముద్రంపై ఆధారపడి జీవిస్తున్నాయి. అయితే ఈ జీవులు అప్పుడప్పడూ సముద్ర తీరానికి కొట్టుకొస్తాయి. అయితే వాటిలో ఎక్కువగా మృత కళేబరాలే ఉంటాయి. కానీ చాలా అరుదుగా కొన్ని జీవులు సజీవంగా సముద్రతీరానికి కొట్టుకొస్తుంటాయి. తాజాగా తమిళనాడు రామేశ్వరంలోని విల్లుండి సముద్ర తీరానికి ఓ అరుదైన జీవి సజీవంగా కొట్టుకొచ్చింది. దానిని చూసి స్థానికకులు ఆశ్చర్యపోయారు. వెంటనే జలవనరులశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. స్థానికుల సమాచారంతో విల్లుండి సముద్రా తీరానికి చేరుకున్నారు అధికారులు. సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన ఆ జీవిని దుగోంగ్‌గా ( ఓ రకమైన సముద్ర జీవి ) గుర్తించారు.

ఒడ్డుకు కొట్టుకు వచ్చిన దుగోంగ్‌ను తిరిగి సముద్రంలోకి పంపించారు. ఇవి సముద్ర క్షీరదాలు. సిరేనియా జాతికి చెందిన క్షీరదం. ఇవి నాలుగు రకాలు ఉంటాయి. అందులో దుగోంగ్‌ ఒకటి. ఇవి చూడటానికి సీల్స్‌ లాగే ఉంటాయి. సముద్రపు ఆవులుగా పిలువబడే ఈ జీవులు ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల్లోని సముద్ర జలాల్లో జీవిస్తున్నాయి. ఈ దుగోంగ్‌ల తోక అచ్చం డాల్ఫిన్‌ తోకను పోలి ఉంటుంది. దాంతో చూసిన వెంటనే దీనిని డాల్ఫిన్‌ అనుకుంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి