Dubai Crown Prince: దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ అల్ మక్తూమ్ తన కుటుంబం, స్నేహితులతో కలిసి విహారయాత్ర కోసం లండన్‌లో పర్యటించారు. తన టూర్‌కి సంబంధించిన ఫోటోలు, వీడియోలను ప్రిన్స్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశారు. తనకు 14.5 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. దాంతో ఈ అతడు పెట్టిన పోస్ట్‌లు తెగ వైరల్ అవుతున్నాయి. వాటిలో ఒక ఫోటో క్రౌన్ ప్రిన్స్‌ని చూపిస్తుంది. అయితే, ఇక్కడ విచిత్రం ఏంటంటే..
దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ అల్ మక్తూమ్ లండన్ ట్యూబ్‌లో ప్రయాణించడం తోటి ప్రయాణీకులు గుర్తించలేదు. ఈ పోస్టు క్యాప్షన్‌లో “మేము చాలా దూరం వెళ్లాల్సి ఉంది. బద్ర్ ఇప్పటికే విసుగు చెందింది” అని వ్రాసాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో 14.5 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్న యువరాజు, అతని పోస్ట్‌కు 510,000 లైక్‌లు పొందాడు. ”లండన్ ట్యూబ్ ప్రయాణం చాలా స్ఫూర్తిదాయకం! మీరు చాలా డిఫెరెంట్.. ఈ ప్రయాణంలో మీరు నిజమైన మానవ కథలను చూస్తారు” అని పాకిస్థానీ కళాకారిణి సారా షకీల్ పోస్టును ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే, గత నెలలో షేక్ హమ్దాన్ తన కారులో లండన్‌లోని దుబాయ్ నివాసితులతో సెల్ఫీలు తీసుకుంటున్నట్లు చూపించిన వీడియో వైరల్ అయ్యింది.
#Watch: @Nawazuddin_S ditches the car and opts for Mumbai local to save time traveling amidst traffic!#NawazuddinSiddiqui #ViralVideo #MumbaiLocals #Mumbai #MumbaiTraffic #Bollywood #BollywoodCelebrity pic.twitter.com/7hlhMc7sHF
— Free Press Journal (@fpjindia) March 28, 2022
మరొక ఫోటోలో, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కూడా లండన్‌లో విహారయాత్రలో షేక్ హమ్దాన్‌తో చేరారు. క్రౌన్ ప్రిన్స్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో తన తండ్రి, అతని ఇద్దరు పిల్లలతో ఉన్న ఫోటో షేర్ చేశారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి