Watch: అంతా కృష్ణమయం..! హరే క్రిష్ణా.. హరే క్రిష్ణ అంటూ భక్తిపారవశ్యంలో మునిగిపోయిన పోలీస్ ఆఫీసర్..

|

Apr 27, 2023 | 7:07 PM

పూర్తిగా భక్తిలో నిమగ్నమైన పోలీసును మీరు ఆశ్చర్యపోతారు. బృందావనంలో సదరు పోలీస్ ఆఫీసర్ కళ్లు మూసుకుని, మనసు నిండా శ్రీకృష్ణుడిపై భక్తితో డ్యాన్స్ చేశాడు. అతడిని చూడగానే జనాల మనసు కూడా పూర్తిగా చల్లబడి భక్తి పారవశ్యంలో మునిగిపోతున్నారు..ఈ వీడియో ఇంటర్నెట్ వినియోగదారుల మనసు దోచుకుంది.

Watch: అంతా కృష్ణమయం..! హరే క్రిష్ణా.. హరే క్రిష్ణ అంటూ భక్తిపారవశ్యంలో మునిగిపోయిన పోలీస్ ఆఫీసర్..
Up Police Officer In Mathur
Follow us on

మీరు పీకల్లోతు బాధలో ఉన్నారా..? మీ మానసిక స్థితి అస్సలు బాగోలేదా..? అయితే, రిఫ్రెష్‌మెంట్‌ కావాలనుకుంటే మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను తప్పక చూడండి. ఎప్పుడైతే నీవు ఆ భక్తిలో మునిగిపోతావో, ఈ లోకమంతా నీ ముందు చిన్నదిగా అనిపిస్తుంది. నీ కష్టాలన్నీ మరచిపోయి అందులో మునిగిపోతావు. ఎందుకంటే, ప్రస్తుత కాలాన్ని నడిపిస్తుంది ఇంటర్‌ మాత్రమే. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో కనిపించింది. ఈ వీడియో చూశాక మీ మనసు కూడా సంతోషిస్తుంది.

ప్రస్తుతం, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో సంచలనం సృష్టిస్తున్న వీడియో ఉత్తరప్రదేశ్‌కు చెందింది. ఇందులో ఒక పోలీసు గుడిలో శ్రీకృష్ణుని స్తోత్రాలకు భక్తితో డ్యాన్స్ చేస్తుండటం కనిపించింది. ఫుటేజ్ ట్విట్టర్‌లో షేర్ చేయగా, 182k కంటే ఎక్కువ వ్యూస్‌ సంపాదించింది. పూర్తిగా భక్తిలో నిమగ్నమైన పోలీసును మీరు ఆశ్చర్యపోతారు. బృందావనంలో సదరు పోలీస్ ఆఫీసర్ కళ్లు మూసుకుని, మనసు నిండా శ్రీకృష్ణుడిపై భక్తితో డ్యాన్స్ చేశాడు. అతడిని చూడగానే జనాల మనసు కూడా పూర్తిగా చల్లబడి భక్తి పారవశ్యంలో మునిగిపోతున్నారు..ఈ వీడియో ఇంటర్నెట్ వినియోగదారుల మనసు దోచుకుంది.

ఇవి కూడా చదవండి

15 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో.. పోలీసు యూనిఫాం ధరించి ఒక ఆలయంలో శ్రీకృష్ణుని స్తోత్రాలకు ఉత్సాహంగా నృత్యం చేస్తున్నాడు. పోలీసు డ్యాన్స్‌లోని భక్తిశ్రద్ధలు ఆ వీడియోను మళ్లీ మళ్లీ చూసేలా చేస్తున్నాయి.. ఈ వీడియో చూసిన తర్వాత మీ మనసు కూడా తేలికవుతుంది. శ్రీకృష్ణుడి పట్ల భక్తిలో మునిగితేలుతున్న సబ్-ఇన్‌స్పెక్టర్ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. హరే కృష్ణ కీ జై” అనే శీర్షికతో వీడియో షేర్ చేశారు..

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..