Viral Video: అంజన్న సాక్షిగా.. ఆలయంలో చోరీ.. విరాళాల లెక్కింపులో సిబ్బంది చేతివాటం.. పట్టించిన నిఘానేత్రం

|

Sep 28, 2024 | 1:01 PM

ప్రముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. దేవుడికి సమర్పించిన విరాళాల లెక్కింపు నగదును గుట్టుగా దారి మళ్లించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. దీంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Viral Video: అంజన్న సాక్షిగా.. ఆలయంలో చోరీ.. విరాళాల లెక్కింపులో సిబ్బంది చేతివాటం.. పట్టించిన నిఘానేత్రం
Donation Theft
Follow us on

ఆలయంలో నగదును దొంగిలించిన ఇద్దరిపై వేటు పడింది. కర్ణాటకలోని గాలి ఆంజనేయ స్వామి ఆలయంలో విరాళాల చోరీకి సంబంధించిన వీడియో ఒకటి భక్తుల ఆగ్రహానికి కారణమైంది. ద్దరు వ్యక్తులు విరాళాలను లెక్కిస్తున్న క్రమంలో చేతివాటం ప్రదర్శించారు. ఒకరు నగదు కట్టను మరొకరికి పంపి దానిని జేబులో గుట్టుగా పక్కకు దాట వేసుకున్నారు. ఈ వీడియో ప్రకారం.. భక్తుల విరాళాలను లెక్కిస్తున్న సమయంలో ఇద్దరు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు చోరీకి పాల్పడ్డారని తెలిసింది.

వైరల్‌ వీడియోలో ఓ వ్యక్తి తొలుత డబ్బుల కట్టను తీసుకుని పూజారికి అందించగా, పూజారి దానిని అందుకుని పక్కకు వెళ్లిపోయాడు. ఈ ఘటన ఏడాది క్రితం జరగ్గా, తాజాగా వారిపై చర్యలు తీసుకున్నారని తెలిసింది.

ఈ వీడియో చూడండి..

ఇవి కూడా చదవండి

జరిగిన ఘటన నేపథ్యంలో దేవస్థానం CCTV నిఘాను పెంచింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నివారించడానికి విరాళాల లెక్కింపులో వాలంటీర్లను చేర్చింది. పూజారి రామచంద్ర భక్తులకు భరోసా కల్పించి ప్రస్తుతం ప్రసాదాలను కాపాడేందుకు రక్షణ చర్యలు చేపట్టామన్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..