Viral Video: ఈ కిలాడీ కుక్క తెలివే వేరయా..! ఆహారం కోసం ఏం చేసిందో చూస్తే.. ఫ్యూజులు ఎగరాల్సిందే..

|

Apr 09, 2022 | 9:45 AM

Dog Viral Video: సోషల్ మీడియా నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా.. ఓ కుక్కకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Viral Video: ఈ కిలాడీ కుక్క తెలివే వేరయా..! ఆహారం కోసం ఏం చేసిందో చూస్తే.. ఫ్యూజులు ఎగరాల్సిందే..
Dog
Follow us on

Dog Viral Video: సోషల్ మీడియా నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా.. ఓ కుక్కకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. శునకం చేసిన కొంటె పనిని.. దాని యజమాని రికార్డ్ చేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి ప్రపంచంలోని అత్యంత తెలివైన, విశ్వాసమైన జంతువులలో శునకాలు ఒకటి. ఇవి తమ యజమాని ఇంటిని జాగ్రత్తగా చూసుకోవడానికి.. తమ ప్రాణాలను సైతం అర్పించడానికి సిద్ధంగా ఉంటాయి. కుక్కల విధేయతను ఉదహరించే అనేక వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. అయితే ఇంట్లో కుక్క దొంగతనం చేయడం ఎప్పుడైనా చూశారా? అయితే.. ఈ వీడియోలో కుక్క దొంగతనం చేస్తూ పట్టుబడింది. ఈ రోజుల్లో కుక్క దొంగతనం చేస్తున్న వీడియో తెగ వైరల్ అవుతోంది. యజమాని లేకపోవడంతో వంటగదిలో ఆహారం తింటూ కుక్క ఎంజాయ్ చేస్తూ కనిపించింది. ఆహారాన్ని దొంగిలించడానికి కుక్కు ఉపాయాలు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కొంటె కుక్క చర్యను దాని యజమాని ఫోన్ లో రికార్డ్ చేశాడు. అది ఇప్పుడు సోషల్ మీడియా (Social Media) లో వైరల్‌గా మారింది.

వైరల్ అవుతున్న వీడియోలో కుక్కపిల్ల తన రెండు కాళ్లతో కుర్చీని నెట్టుకుంటూ వంటగది వైపుకు తీసుకెళుతుంది. అలా హాయిగా వంటగది దగ్గరకు చేరుకుంటుంది. ఆ తర్వాత అది వంటగది బల్లా పైకి ఎక్కి ఆహారం తినడం ప్రారంభించింది. ఈ సన్నివేశాన్ని డాగీ యజమాని రికార్డ్ చేశాడు. కానీ డాగీకి ఈ విషయం తెలియదు. కొంత సేపటి తర్వాత యజమాని వంటగదిలోకి వెళ్లగా, కుక్క అదే కుర్చీపై నిల్చుని ఆనందంగా తినడం కనిపించింది.

వైరల్ వీడియో..

ఈ వీడియోను Buitengebieden అనే యూజర్ ట్విట్టర్‌లో షేర్ చేసింది. దీనిని నెటిజన్లు తెగ ఇష్టపడుతున్నారు. ఈ డాగీ ఆహారాన్ని దొంగిలించడంలో అద్భుతమైన తెలివిని ప్రదర్శించిందంటూ ఒకరు పేర్కొనగా.. కుక్కలు ఎప్పుడూ కూడా తెలివిగానే ఉంటాయని మరొకరు పేర్కొన్నారు.

Also Read:

Viral Video: నమ్మశక్యం కానీ సాహసం.. ఆకాశంలో, ఆరు వేల అడుగుల ఎత్తులో తాడుపై అవలీలగా..