మూసి ఉన్న కంటైనర్ లోపల నుండి ఉన్నట్టుండి ఏవో శబ్ధాలు రావటం మొదలైంది..అది చూసి మెరైన్ అధికారులు భయంతో వణికిపోయారు. లోపల ఏముందో తెలియక ఆందోళనలోపడ్డారు. అమెరికన్ మెరైన్ అధికారులు షిప్పింగ్ కంటైనర్ నుండి ప్రత్యేక రెస్క్యూ గురించిన ఈ వార్తను ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ ద్వారా షేర్ చేశారు. దీనికి ప్రజల నుండి విశేష స్పందనలు వచ్చాయి. వారు చేసిన పనికి నెటిజన్లు అభినందించారు. అయితే, ఇంతకు ఆ కంటైనర్‌లో ఏముందన్న విషయానికి వస్తే..
మూసి ఉన్న కంటైనర్‌లో క్రమంగా శబ్ధాలు రావటం గమనించిన మెరైన్ సిబ్బంది.. దాన్ని ఓపెన్ చేసి చూశారు.. అందులో కనిపించినది చూసి ఒక్కసారిగా అంతా కంగుతిన్నారు. వారం రోజులుగా ఆహారం, నీరు లేకుండా కంటైనర్‌లో పడివున్న ఒక కుక్క కనిపించింది వారికి. షిప్పింగ్ ఉద్యోగి నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగి ఉండొచ్చునని చెప్పారు. ఎట్టకేలకు ఆ కుక్క ఇప్పుడు ప్రాణాలతో బయటపడింది.. లేదంటే, ఇప్పటికే దాని ప్రాణం ఉండేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు దాన్ని చూడగానే ఏం జరిగిందో మొత్తం అర్థం చేసుకున్నారు. వెంటనే దానికి నీరు, ఆహారం అదించి తదుపరి చికిత్స కోసం జంతు సంరక్షణా కేంద్రానికి తీసుకెళ్లారు.
ఈ రెస్క్యూ గురించి మెరైన్ అధికారులు తమ ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ ద్వారా వెల్లడించారు. దీనికి సంబంధిచి యుఎస్ కోస్ట్ గార్డ్ హార్ట్‌ల్యాండ్ ఫేస్‌బుక్‌లో కొన్ని ఫోటోలను కూడా షేర్ చేశారు. ఈరోజు ముందుగా, యుఎస్ కోస్ట్ గార్డ్ సెక్టార్ హ్యూస్టన్-గాల్వెస్టన్ నుండి వచ్చిన మెరైన్ ఇన్‌స్పెక్టర్ల బృందం ఒక కుక్క ప్రాణాన్ని కాపాడింది అని రాశారు. ‘MST3 బ్రియాన్ వైన్‌స్కాట్, MST1 లూకాస్ లో, MST2 ర్యాన్ మెక్‌మాన్, MST3 జోస్ రేయెస్ షిప్పింగ్ కంటైనర్‌లను యాదృచ్ఛికంగా తనిఖీ చేస్తున్నప్పుడు, వారు అకస్మాత్తుగా ఒక కంటైనర్ నుండి అరుపులు, కాళ్లతో కంటైనర్ గోడలను గీస్తున్న శబ్ధాలు వినిపించాయని చెప్పారు. దాంతో వెంటనే వారు కంటైనర్‌ను దించి తలుపు తెరవగా ఒక కుక్క బయటకు వచ్చిందన్నారు.
ఇంకా ఇలా వ్రాశాడు.. పాపం, ఈ నోరులేని మూగజీవి కనీసం ఒక వారం పాటు కంటైనర్‌లో ఇరుక్కుపోయిందన్నారు. ఆకలితో ఉంది. రక్షించేవారిని చూసిన వెంటనే అది పైకి దూకింది. కోస్ట్ గార్డ్ సభ్యులు దానికి నీరు ఆహారం అందించి, తదుపరి సంరక్షణ కోసం స్థానిక జంతు సంరక్షణా కేంద్రానికి తీసుకువచ్చారు. వారికి ధన్యవాదాలు అని చెప్పారు.
ఒక ఫోటోలో కోస్ట్ గార్డ్ సభ్యుడు రెస్క్యూ తర్వాత కెమెరాకు పోజులిచ్చాడు. రెండవదానిలో, కుక్క వాహనం లోపల కూర్చుని ఉండటం కనిపించింది. మూడో ఫోటోలో రెస్క్యూ టీమ్ కుక్కతో పోజులివ్వడం చూపించారు. ఫేస్‌బుక్ పోస్ట్ ఫిబ్రవరి 1న షేర్ చేయబడింది. అప్పటి నుండి చాలా మంది డాగ్ లవర్స్ దీనిపై చాలా రియాక్షన్లు ఇచ్చారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…