ఓ వ్యక్తి తీవ్ర కడుపునొప్పితో బాధపడ్డాడు. అతనికి పదే పదే విరేచనాలు అవుతున్నాయి. ఫుడ్ పాయిజనింగ్ జరిగి ఉండొచ్చని తొలుత ఆ వ్యక్తి భావించాడు. అయితే మందులు వాడినా ఉపశమనం లేకపోవడంతో నేరుగా ఆస్పత్రికి వెళ్లాడు. కానీ వైద్యులు అతని కడుపులో అల్ట్రాసౌండ్ చేయగా, లోపలి భాగాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అతని కడుపులో కదలాడుతున్న దానిని చూశారు. అది అక్కడికి ఎలా చేరిందో అని తలలు పట్టుకున్నారు. వియత్నాం దేశంలో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది.
34 ఏళ్ల వ్యక్తి కడుపు నొప్పితో బాధపడుతూ మార్చి 20న నిన్‌వా ప్రావిన్స్‌లోని ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ అతని పరిస్థితిని చూసిన వైద్యులు వెంటనే అతన్ని ఆసుపత్రిలో చేర్చారు. వారు ఆ వ్యక్తికి అల్ట్రాసౌండ్, ఎక్స్-రే పూర్తి చేసినప్పుడు, వైద్యులు రిపోర్టును చూసి షాక్ అయ్యారు. ఎందుకంటే, అతని కడుపులో ఏదో జీవి చిక్కుకుపోయి కనిపించింది. దీని తరువాత వెంటనే ఆవ్యక్తికి శస్త్రచికిత్స చేసిన కడుపులోకి ప్రాణిని బయటకు తీశారు. ఇప్పుడు అతను పూర్తిగా క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఓ వ్యక్తి కడుపులో నుంచి 30 సెంటీమీటర్ల పొడవున్న ఈల్‌ను వైద్యులు తొలగించారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. రెండ్రోజులు కడుపులో ఉండి కూడా చనిపోలేదని వైద్యులు తెలిపారు. నిజానికి, రోగి తన కడుపు లోపల కదలిక కారణంగా భరించలేని నొప్పిని అనుభవించినట్లు సమాచారం. లైవ్ ఈల్ రోగి ప్రేగులలో రంధ్రం చేసిందని, దాని కారణంగా అంతర్గత రక్తస్రావం కూడా జరుగుతోంది. మరో ఒకటి రెండు రోజులు ఆగితే సదరు వ్యక్తి చనిపోయే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. ఇంత పెద్ద చేప పేషెంట్ కడుపులోకి ఎలా చేరిందో వైద్యులే ఆశ్చర్యపోయారు. దీనిపై వైద్యులు రోగిని ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పలేకపోయాడు. పేగు ఇన్‌ఫెక్షన్‌ను నయం చేసేందుకు నెక్రోటిక్ రెక్టమ్‌ను కట్ చేసి వేరు చేసినట్లు వైద్యులు తెలిపారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి…