Viral News: గ్యాస్‌ సిలిండర్లు స్థూపకారంలోనే ఎందుకు ఉంటాయి.? చతురస్రాకారంలో ఎందుకుండవు.? కారణమేంటంటే..

|

Nov 06, 2021 | 11:32 AM

Viral News: దాదాపు అందరి ఇళ్లలో కచ్చితంగా కనిపించే వస్తువుల్లో గ్యాస్‌ సిలిండర్‌ ఒకటి. సాధారణంగా వాయువులను నిల్వ ఉంచేందుకు సిలిండర్లను ఉపయోగిస్తామనే విషయం మనందరికీ తెలిసిందే...

Viral News: గ్యాస్‌ సిలిండర్లు స్థూపకారంలోనే ఎందుకు ఉంటాయి.? చతురస్రాకారంలో ఎందుకుండవు.? కారణమేంటంటే..
Gas Cylinder Shape
Follow us on

Viral News: దాదాపు అందరి ఇళ్లలో కచ్చితంగా కనిపించే వస్తువుల్లో గ్యాస్‌ సిలిండర్‌ ఒకటి. సాధారణంగా వాయువులను నిల్వ ఉంచేందుకు సిలిండర్లను ఉపయోగిస్తామనే విషయం మనందరికీ తెలిసిందే. అది ఎల్‌పీజీ అయినా ఆక్సిజన్‌ అయినా అన్నింటి నిల్వకు సిలిండర్లను ఉపయోగిస్తుంటాం. అయితే మనం చూసే సిలిండర్లన్నీ స్థూపకారంలోనే ఉంటాయి. మరి వీటి ఆకారం అలాగే ఎందుకు ఉంటుంది.? చతురస్రాకారంలో తయారు చేయొచ్చు కదా.! అనే సందేహం ఎప్పుడైనా వచ్చిందా.? అయితే దీని వెనకాల ఓ లాజిక్‌ ఉందండోయ్‌. ఇంతకీ గ్యాస్‌ సిలిండర్లు స్థూపకారంలోనే ఉండడానికి కారణమేంటంటే..

సిలిండర్లను స్థూపకారంలో తయారు చేయడానికి ఒత్తిడి ప్రధాన కారణం. సాధారణంగా వాయువులకు ఉండే ప్రధాన లక్షణం ఒత్తిడి. వాయువులు నిల్వచేసిన కంటైనర్‌ మొత్తాన్ని ఆక్రమిస్తాయి. ఈ కారణంగానే వాటిని నిల్వ చేసిన వాటిలో తీవ్రమైన ఒత్తిడి పెరుగుగుంది. ఈ కారణంగానే వాయువులను నిల్వ చేసే కంటైనర్లను స్థూపకారంలో తయారు చేస్తారు. ఒక వేళ చతురస్రాకార కంటైనర్‌లో వాయువులను నిల్వచేసిన నట్లైతే కంటైనర్‌లోని నాలుగు మూలలకు ఒత్తిడి పెరుగుతుంది. దీని కారణంగా గ్యాస్‌ లీక్‌ కావడం, లేదా కంటైనర్‌లు పేలి పోవడంలాంటివి జరుగుతుంటాయి. ఈ కారణంగానే సిలిండర్లను స్థూపకారంలో తయారు చేశారు.

ఇక వీటి ఆకారం వెనక మరో కారణం కూడా ఉంది. స్థూపాకారంలో ఉన్న కంటైనర్లను రవాణా చేయడం చాలా సులభం. ఎందుకంటే తక్కువ స్థనంలో ఎక్కువ కంటైనర్లను అమర్చవచ్చు. ఇక స్థూపకారంలో ఉన్న ట్యాంకర్‌లను వాహనంలోకి ఎక్కిస్తే, గురుత్వాత్వకర్షణ కేంద్రాన్ని కూడా తగ్గిస్తుంది. దీంతో ఇది వాహనాన్ని స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. కాబట్టి ప్రమాదాలు జరిగే అవకాశాలు తగ్గుతాయి. కేవలం ఎల్‌పీజేకే పరిమితం కాకుండా ఆక్సిజన్‌ను నిల్వచేసే కంటైనర్‌లను కూడా స్థూపకారంలోనే తయారుచేస్తారు.

Also Read: Viral Video: నాగుపాముకు చిక్కిన ఉడుము.. కోబ్రా వేట మాములుగా లేదుగా.. వీడియో చూస్తే హడలిపోతారు.!

IIITDM Recruitment: కర్నూలు ఐఐఐటీడీఎం నాన్‌ టీచింగ్‌ పోస్టులు.. అర్హులు ఎవరు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

Kartika Masam: ప్రీతికరం కార్తీక మాసం విశిష్టత.. ఆచరించాల్సిన పద్ధతుల గురించి తెలుసుకోండి..