Viral Video: ఆత్మవిశ్వాసం, ధైర్యం తోడుగా ఉంటే ఎలాంటి అడ్డంకులైనా సులభంగా అధిగమించవచ్చు. ఈ ప్రపంచం ముందు మనల్ని మనం నిరూపించుకోవచ్చు. అందుకోసం మహాత్మాగాంధీ, అబ్రహం లింకన్, నెల్సన్ మండేలా వంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని సార్లు మన చుట్టుపక్కల ఉండే కొందరు వ్యక్తులే మనకు స్ఫూర్తిగా నిలుస్తుంటారు. తాజాగా వీల్‌చైర్లో కూర్చొని ఫుడ్ డెలివరీ విధులు నిర్వర్తిస్తున్న ఓ ఫుడ్ డెలివరీ బాయ్‌ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అతని ఆత్మస్థైర్యాన్ని మెచ్చుకున్నారు. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో బాగా వైరలవుతోంది. చాలామంది నెటిజన్లు ఈ వీడియోను చూసి ఎమోషనల్ అవుతున్నారు. అదే సమయంలో ఆ వ్యక్తి ఆత్మస్థైర్యాన్ని చూసి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
మన పోరాటాన్ని శక్తిగా మార్చుకోవడం ప్రపంచంలోనే అత్యంత కష్టమైన పని అంటారు. మన జీవితానికి అన్వయించుకోవడం అంతసులభమేమీ కాదు. అయితే నెట్టింట్లో వైరలవుతోన్న ఈ వీడియోలో ఒకరికి కాలు లేదు. అయినా చేతి కర్రల సహాయంతో సిమెంట్ బస్తాలు మోస్తుండడం అందరినీ భావోద్వేగానికి గురిచేస్తోంది. అతను చేస్తున్నదే చిన్నపని కావొచ్చు. కానీ ఈ వీడియో చాలామందికి స్ఫూర్తినిస్తుంది. ముఖ్యంగా చిన్న చిన్న కారణాలు, నిస్సహాయతతో ఆత్మహత్యలు చేసుకునే యువతకు ఈ వ్యక్తి ధైర్యం ఒక మేలు కొలుపని భావించవచ్చు. ఈ వీడియోను టార్క్సాహిత్య అనే ఖాతా ద్వారా ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇప్పటివరకు లక్షలాది మంది ఈ వీడియోను వీక్షించారు. ‘ధైర్యం ఉన్నవారికి దేవుడు కూడా అండగా నిలుస్తాడు. మన మట్టిలోనే ఏదో గొప్పతనం ఉంది’ అంటూ సిమెంట్ బస్తాలు మోస్తోన్న వ్యక్తిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
लोगों को अपना परिश्रम संघर्ष लगता है और दूसरों का तमाशा।
~ सत्यव्रत रजक pic.twitter.com/43J9D2MqU8
— तर्क साहित्य (@tarksahitya) July 27, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..