అడవిలో వేటగాళ్లదే ఆధిపత్యం. సింహం, పులి, మొసలి, చిరుత.. లాంటి క్రూర మృగాలు చిన్న జంతువులను వేటాడి.. చంపి తింటుంటాయి. అడవికి రాజు సింహం.. ఒక్క గాండ్రింపుతోనే మిగతా జంతువులను హడలెత్తిస్తుంది. ఇక పులి, చిరుత అయితే తమ వేగంతో.. మిగతావాటిని బెంబేలెత్తిస్తాయి. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు తెగ చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా ఓ వీడియో ఇంటర్నెట్‌లో హల్చల్ చేస్తోంది. ఆ వైరల్ వీడియో ప్రకారం.. ఓ సింహల గుంపు మొసలిని వేటాడి పట్టుకుని ఆరగించడం మీరు చూడవచ్చు. చిన్నపాటి సరస్సులో ఉన్న ఓ మొసలిని చాకచక్యంగా పట్టుకుంది ఒక సింహం. దాని పదునైన పళ్లతో ఆ మొసలిని ఒడిసిపట్టుకునేలోపే.. ఎక్కడ నుంచి వచ్చాయో గానీ.. ఇంకొన్ని సింహాలు అక్కడికి వచ్చి చేరాయి. అన్ని కూడా మొసలి మీదదిపోయి.. ఒక్క ఉదుటున దాన్ని చంపేశాయి. ఇక ఆ మొసలి కళేబరాన్ని ఇంచక్కా సేద తీరుతూ మింగేశాయి. లేట్ ఎందుకు మీరూ వీడియోపై లుక్కేయండి.