ఏ దంపతుల జీవితంలోనైనా తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందే క్షణాలు అపురూపం. భార్య గర్భం దాల్చింది అని తెలిసిన క్షణం నుంచి ఆ భర్త సహా కుటుంబం చూపించే కేరింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇక గర్భణీకి ఇరు కుటుంబ సభ్యులు జరిపించే సీమంతం అమ్మగా ఆమె జీవితంలో అపురూపం. తాజాగా నెట్టింట్లో ఒక గర్భణీ కి సంబంధించిన వీడియో చక్కర్లు కొడుతోంది. ఈ క్లిప్ ఎవరినైనా ఆకట్టుకుంటుంది. ఒక జంట సీమంతం వేడుకలో కింగ్ సినిమాలోని ‘మాన్ మేరీ జాన్’ సాంగ్ కు చేసిన డ్యాన్స్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.
చిన్నదైన ఇంకా అద్భుతమైన ఈ క్లిప్‌లో గర్భవతి అయిన భార్యతో కలిసి భర్త అత్యంత అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్నాడు. వీరిద్దరూ కలిసి డ్యాన్స్ చేసిన విధానంలో ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకూ ఈ వీడియో 1.1 మిలియన్లకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఈ జంట తమ ప్రేమతో నెటిజన్లను ఆకట్టుకున్నారు.
“అంత మనోహరమైన జంట … వీరు చేస్తున్న డ్యాన్స్ లో ఒకరినొకరు ఎంతగా ప్రేమిస్తున్నారో స్పష్టంగా ప్రతిబింబిస్తుంది” అని ఒక వ్యక్తి కామెంట్ చేశారు. మరొకరు ఇలా వ్యాఖ్యానించారు, “ఈ వీడియో అతి సుందరమైన.” “వీరి ప్రేమ చాలా స్వచ్ఛమైనది, నాకు నచ్చింది” అని వ్యాఖ్యానించాడు. మరొకరు “ఇది చాలా మధురమైనది ..విమెన్ లీడింగ్.. గై ఫాలోయింగ్.. లవ్ ఇట్” హార్ట్ ఎమోజితో తన ప్రేమని తెలిపారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..