Trending Video: వెడ్డింగ్ అంటేనే సందడి.. బంధువులు, ఫ్రెండ్స్, వెల్ విషర్స్ అందరూ ఒకచోట కనిపిస్తే కన్నుల పండుగగా ఉంటుంది. ఇక అంతమంది అక్కడ కనిపిస్తే ఆ జోష్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా…?. దుమ్ము లేచిపోవాల్సిందే. తాజాగా అలాంటి ఓ సెలబ్రేషన్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పాన్ ఇండియా లెవల్‌లో సత్తా చాటిన తెలుగు మూవీ పుష్ప(Pushpa) సినిమా ఎఫెక్ట్ పెళ్లిళ్లు, ఈవెంట్స్‌లో రేంజ్‌లో కనిపిస్తుంది. అల్లు అర్జున్(Allu Arjun), రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా చేసిన ఈ సూపర్ హిట్ మూవీలోని పాటలు.. ప్రపంచవ్యాప్తంగా అదరగొడుతున్నాయి. అందర్నీ ఓ ఊపు ఊపేస్తున్నాయి. మరీ ముఖ్యంగా సమంత(Samantha) డ్యాన్స్ చేసిన ‘ఊ అంటావా మావా’ అనే ఐటమ్ నంబర్ అయితే నెక్ట్స్ లెవల్‌లో ట్రెండ్ అవుతుంది. ఇక ఈ సాంగ్‌కు ఓ పెళ్లి వేడుకలో వధువు తండ్రి.. హాట్ స్టెప్పులు వేస్తూ అందర్నీ ఆశ్చర్యపరిచాడు. తగ్గేదే లే అన్నట్లుగా… లిరిక్స్‌కు తగ్గట్టుగా.. డ్యాన్స్ మూమెంట్స్ వేస్తూ.. గెస్టులందరనీ ఎంటర్టైన్ చేశాడు. ఆయన డ్యాన్స్ చూసి అక్కడికి వచ్చిన గెస్టులు మాత్రమే కాదు.. నెటిజన్లు సైతం ఇంప్రెస్ అయ్యారు. ‘వాహ్.. ఇది కదా గ్రేస్ అంటే’ అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. ‘డ్యాన్స్ మాత్రమే కాదు.. ఎక్స్‌ప్రెషన్స్ కూడా అదుర్స్.. అంకుల్ మీరు సినిమాల్లో ట్రై చేయండి..’ అని మరొకరు వ్యాఖ్యానించారు. ఆ క్రేజీ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
Also Read: APSRTC: ఏపీ ప్రజలపై మరో భారం.. ఆర్టీసీ ఛార్జీలపై డీజిల్ సెస్ విధింపు